calender_icon.png 15 November, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారుల సంపూర్ణ వికాసం విద్యతోనే సాధ్యం: ఆర్డీవో అశోక్ రెడ్డి

15-11-2025 08:18:04 PM

నకిరేకల్,(విజయక్రాంతి): చిన్నారుల సంపూర్ణ వికాసం విద్య తోనే సాధ్యమని నల్గొండ ఆర్ డి వో  యానాల అశోక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జి.బి.ఎం ఫంక్షన్ హాల్ లో గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల దినోత్సవం రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్డీవో అశోక్ రెడ్డి ముందుగా భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ గురించి మాట్లాడుతూ... నెహ్రూ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఎక్కువకాలం జైల్లో గడిపాడని, దాంతో తన బిడ్డ అయిన ఇందిరాగాంధీకి తగిన సమయం ఇవ్వలేక, ఆమె బాగోగులు చూడలేకపోవడంతో ఆమె చిన్నతనంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇతర ఏ చిన్నారులు కూడా ఎదుర్కోవద్దని ఆయన ప్రధాని అయ్యాక ఎక్కువ సమయం చిన్నారుల తోటే గడిపే వాడని,అందుకే చిన్నారులు అంటే ఆయనకు ఎంతో ఇష్టమని, అన్నారు.

నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని జి బి ఎం ఫంక్షన్ హాల్ లో రెండు రోజులు మన దేశ సంస్కృతి,సాంప్రదాయాల ను ఉట్టి పడేలా,వివిధ వేష ధారణలు,నృత్య ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.గ్రామీణ ప్రాంతమైన శాలిగౌరారం మండల కేంద్రం లో దాదాపు 600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న గీతాంజలి స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు.ఈ కార్యక్రమం లో నర్సరీ నుండి పదవ తరగతి వరకు దాదాపు 600 మంది విద్యార్థులు వివిధ పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు.ముఖ్యంగా నర్సరీ ఎల్ కే జీ,యూకేజీ చిన్నారుల వివిధ నృత్య ప్రదర్శనలు తల్లితండ్రుల ను ఎంతో అలరించాయి.

ఈ సందర్భంగా గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ దొంతూరి పరమేష్,ప్రిన్సిపాల్ ప్రభంజన్ మాట్లాడుతూ చదువు చదువు అంటూ ఎప్పుడు పిల్లలు పుస్తకాలతోనే కుస్తీపడుతూ ఉంటారని,విద్యార్థుల్లో ఉన్న వివిధ రకాల టాలెంట్ ని వెలుగు తీయడానికి,వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ఏడాదికి ఒకసారి రెండు రోజులు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.దాంతో విద్యార్థులు రెండు రోజులు విద్యార్థులు తమల్ని తాము మైమరిచిపోయి ఉత్సాహంగా వివిధ నృత్య ప్రదర్శనలు చేస్తారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.