తాజా మాజీ సర్పంచ్‌లు
సిరిసిల్ల, అక్టోబర్ 28 (విజయక్రాంతి): మూడు నెలలుగా తమ డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరవధిక దీక్షలు చేపడుతు న్నామని, మున్ముందు పోరాటాలతోనే డిమాండ్లను సాధించుకుంటామని సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్‌ల జేఏసీ అధ్యక్షు డు అక్కెనపల్లి కరుణాకర్ అన్నారు.
తొలుత దీక్షలో ఉన్నవారు అఖిల పక్ష నాయకులు అందించిన నిమ్మరసం తీసుకొని రిలే నిర హార దీక్షలను విరమించారు. అనంతరం కరుణాకర్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం నాడు సర్పంచ్‌లు సొంతంగా అప్పు లు చేసి, పనులు పూర్తి చేశారన్నారు. ఆ బిల్లులు రాకపోవడంతో కొందరు ఇంట్లోని బంగారం సైతం తాకట్టు పెట్టారన్నారు.
పెం డింగ్ ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని తాము మూడు నెలలుగా దీక్ష చేస్తూ జిల్లా అధికారులు, మండల అధికారులు, మంత్రు లకు, ఎమ్మెల్యేలు వినతి ఇచ్చామన్నారు. కానీ ఎవరూ స్పందించలేదనా ్నరు. ప్రస్తు తానికి దీక్షలు విరమిస్తున్నామని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామ న్నారు. దీక్షలో శివజ్యోతి, దుమ్మ అంజయ్య, వివిధ పంచాయితీల తాజా మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.