19-11-2025 12:29:30 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు, నవంబర్18 (విజయక్రాంతి): ప్రభుత్వం వరి ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర్ లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు.
మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. అనంతరం మండలంలోని గౌతమిపురం,బూర్గంపాడు నాగినేని పోలు రెడ్డిపాలెం గ్రామాల్లో సుమారు 16లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏడిఈ తాతారావు, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఏవో శంకర్,ఎంపీఓ సునీల్ శర్మ, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి,నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి,భజన సతీష్,చల్లా వెంకటనారాయణ,ప్రసాద్,యూత్ నాయకులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.