calender_icon.png 13 October, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన నేతనే ఎంపిక చేస్తాం

13-10-2025 01:29:55 AM

  1. డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం

ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం

ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ నరేశ్ కుమార్

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్12 (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని, బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ నరేశ్‌కుమార్ స్పష్టం చేశారు.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే సి వేణు గోపాల్ సూచనలతో జరుగుతున్న సంఘతాన్ శ్రీజన్ అభియాన్‌లో భాగంగా జిల్లా అధ్యక్షుడి ఎంపికకు వచ్చిన నరేశ్‌కుమార్‌తో ‘విజయ క్రాంతి‘ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.

‘జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తగిన నాయకత్వాన్ని ఎంపిక చేయడమే మా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, వంశీ చందర్ ఆదేశాలతో నాతోపాటు పీసీసీ పరిశీలకులు శివలింగ్ శ్రీనివాస్ ,అనిల్ కుమార్ ,జ్యోతి కూడా ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నారు. స్థానిక నాయకుల అభిప్రాయాలతో పాటు సాధారణ ప్రజల నుంచి మేధావుల వరకు అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ప్రజలతో కలిసి పనిచేసే, పార్టీ విలువలు నిలబెట్టే నాయకుడి వైపే అధిష్టానం దృష్టి సారిస్తుంది. పార్టీకి నమ్మకమైన, బలమైన నాయకుడిని ఎంపిక చేస్తాం అని చెప్పారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు వచ్చిన మీ భూమికను వివరించగలరా?

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష ఎంపికపై ఇప్పటికే జిల్లాలో కార్యచరణ ప్రారం భించాం. ఎంపికకు సంబంధించిన సంగతాన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముం దుకు సాగుతున్న.

ఈ ఎన్నికల ప్రక్రియ ఎంత వరకు ప్రజా స్వామ్యబద్ధంగా, పారదర్శ కంగా జరుగు తోందని మీరు భావిస్తున్నారు?

ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థిని ఎంపిక చేయడానికి ప్రచారం ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రక్రియ జరుగుతున్నది. ప్రజలకు ఆమోదయోగ్యమైనవి జరగాలి. కాంగ్రెస్ భావజాలంతో ముడిపడి ఉండాలి.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కొత్త అధ్యక్షుడి భూమిక ఎంత వరకు కీలకం?

అధ్యక్ష పదవి చాలా కీలకమైంది. పార్టీ పునర్జీవానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ఎంపిక కూడా వారిపైనే ఉంటుంది.

ఇక్కడి జిల్లా పార్టీలో గత కొంతకాలంగా ఉన్న అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగు తున్నాయా?

పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఇంకా తమ దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారం అధిష్ఠానం చూసు కుంటుంది.  

ఇది ఎస్టీ ప్రాబల్య జిల్లాగా ఉండటంతో, నాయకత్వ ఎంపికలో సామాజిక సమతు ల్యత ఎంతవరకు పాటించబడుతోంది?

 జిల్లా అధ్యక్ష ఎంపిక కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళ తదితర వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. కాంగ్రెస్ సబ్బండ వర్గాల కు గౌరవం దక్కేల ముందుకు వెళుతుంది. పరిశీలనలో తేలిన విషయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి వివరిస్తాను.

గ్రామ, మండల స్థాయి నుంచి వస్తున్న కార్యకర్తల అభిప్రాయాలు మీ పరిశీలనలో ఎలా ఉన్నాయి?

జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక కోసం గ్రామ, మండల స్థాయి కార్యకర్తల అభిప్రాయాలతో పాటు సాధారణ ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించి విశ్లేషించడం జరుగుతుంది. జిల్లాలో ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బలపడాలంటే కొత్త నాయకత్వం ఏ మార్పులు తీసుకు రావాలి అని మీరు భావిస్తున్నారు?

స్థానికంగా బలపడే దిశగానే పార్టీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధ్యక్ష పదవులతో పాటు బ్లాక్ కాంగ్రెస్, బూత్, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటుకు పార్టీ కార్యచరణతో ముందుకెళ్తుంది.

యువత, మహిళలు, గిరిజన వర్గాలకు నాయకత్వం దక్కే అవకాశాలు ఈ ఎన్నికల ద్వారా ఎంతవరకు ఉన్నాయని చూస్తున్నారు?

 రాహుల్ గాంధీ పార్టీ కోసం పనిచేసే నిబద్ధతగల వారికి అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. యువతను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంటుంది.

ఇక్కడి పరిశీలనల ఆధారంగా పార్టీ హైకమాండ్‌కు మీరు ఏ విధమైన సూచనలు ఇవ్వబోతున్నారు?

 సంగతాన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తమకు అధిష్ఠానం సూ చించిన విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడి పరిస్థితులను రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసి గోపాల్, వంశీ చందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. 

జిల్లా అధ్యక్షుడి ఎంపికలో ‘అందరికీ ఆమోదయోగ్యుడు’ అనే ప్రమాణాన్ని ఎలా అంచనా వేస్తున్నారు?

 పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారితో ఒక్కొక్కరిగా కలిసి వారు పార్టీకి చేయాల్సిన సేవలను అడుగుతాం. దరఖాస్తుదారుల అందరితో కలిసి నానంతరం ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనారిటీ ఇలా ఆరుగురితో కూడిన ప్యానల్‌ను అధిష్ఠానానికి నివేదిస్తాం.

కొత్త జిల్లా అధ్యక్షుని ద్వారా పార్టీ బలపడి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకా శాలు మెరుగవుతాయనే నమ్మకముందా?

 కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో నూతన ఉత్తేజంతో ఇక్కడి నాయకత్వం పనిచేస్తుందని భావిస్తున్న.

పార్టీ కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడిందా? లేక పోటీ వాతావరణమే కనిపిస్తోందా?

పార్టీలో ఎలాంటి విభేదాలు ఉన్న వాటి ని పరిష్కరించి పార్టీ కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం ఏర్పాటు చేసేందుకే అందరికీ కలిసిపోయే నాయకుడిని ఎంపిక చేస్తారు. అధ్యక్ష పదవికి పోటీ వాతావరణం ఉన్నప్పటికీ పార్టీ లైన్ ప్రకారం ముందుకెళ్తాం.