13-10-2025 12:54:45 AM
గప్చుప్ రాజకీయం..
అండగా నేనుంటా..
చుక్క, ముక్క, నోటో..
ప్రజా తీర్పు ఎవరికో..
గోపాలపేట, అక్టోబర్12: వనపర్తి జిల్లాలో వాట్సాప్ రాజకీయం హల్చల్ చేస్తుంది. ప్రజా తీర్పుతోనే విజయం సాధిస్తాం అంటూ. గుట్టు చప్పుడు కాకుండా గప్చుప్ గా రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఎంతో హుషారుగా ఉన్న రాజకీయ నాయకులు ఒక్కసారిగా ఉసురుమన్నారు. స్థానిక ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ లో జరిపించేందుకు ఎన్నికల ఈసీ నిర్ణయించడంతో పట్నాల్లో ఉన్న రాజకీయ నాయకులంతా పల్లెల్లోకి దిగారు.
మనం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు చుక్కో, ముక్కో, నోటో, ఎరవేసి కుర్చీని దక్కించుకునేందుకు బడా రాజకీయ నాయకులు పట్నాలు వదిలి పల్లెల్లో దర్శనమిస్తున్నా రండో య్. ఒక్కసారిగా సుప్రీం హైకోర్టులు మొట్టకాయలు వేస్తూ ఎన్నికలను వాయిదా వేసింది. దీంతో వేడెక్కిన రాజకీయ నాయకులు నిరాశ చెందారు. రాజకీయ నాయకులు ఇప్పటికే పల్లెల్లో కాలనీలలో మా గుర్తుకు ఓటెయ్యండి అని హడావిడిగా ఉండేది.
ఈ సాధ్యం కాకపోవడంతో గ్రూప్ రాజకీయ నాయకులు వాట్సాప్ గ్రూపులో హల్చల్ చేస్తున్నారు. ప్రతి పల్లెలో గ్రూప్ వాట్సాప్ ఉండడం పట్ల వాట్సాప్ గ్రూపులో రాజకీయం చేస్తే ప్రతి ఒక్కరికి చేరుతుందని రాజకీయ నాయకులు కుర్చీ దక్కించడం కోసం వాట్సాప్ లో మెసేజ్లు చేస్తున్నారు.
మీ కుటుంబాలకు మన గ్రామానికి ఏ సమస్య వచ్చినా మీ అందరికీ నీ అండగా ఉంటానని వాట్సాప్ లో ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచులకు పోటీలు చేసే నాయకులంతా ఫోన్ వాట్సాప్ లో రాజకీయం ఆశ్చర్యం వేస్తుంది. మీకు కావలసింది నేను అందిస్తానంటూ నిత్యం వాట్సాప్ గ్రూపులు చక్రాలు తిప్పుతున్నాయి. మరి ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచ్ కుర్చీ పదవి ఎవరికి దక్కుతుందో ప్రజల చేతుల్లో ఉందంటూ అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఈ సీట్ల ను ప్రజలు చుక్క కో, ముక్క కో, నోటుకో, లేక నిజాయితీగా పాలించే నాయకునికో కట్టబెడతారో వేచి చూడాల్సి ఉంది.