29-01-2026 12:25:49 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్/భైంసా, జనవరి ౨౮ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, బైం సా మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి పొరపాటు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించా రు. బుధవారం నామినేషన్ కేంద్రాలను పనికి నిర్వహించారు. నామినేషన్ కేంద్రాల్లో సిబ్బం ది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడిగిన వారికి అడిగిన సమాచారం ఇవ్వాలని హెల్ప్‌లైన్ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలని, ఎన్నికల విధులు ముగించే వరకు విధుల్లో ఉన్న అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ శంకర్, ఆర్డీవో రత్న కళ్యాణి, తాసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. అలాగే భైంసా పట్టణంలో మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. బుధవారం నామినేషన్ కేంద్రాలకు వెళ్లిన ఆమె అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ సాయి సాంకేత్ కుమార్ అధికారులు ఉన్నారు.
కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి
జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులందరితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్వో, ఏఆర్వోల నియామకం పూర్తయిందని అన్నారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేసి, నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని, ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి తో సహా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈఓ శంకర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు షుజాఉద్దిన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.