27-12-2025 12:46:33 AM
ఏటూరునాగారం,డిసెంబర్26(విజయక్రాంతి):ములుగు జిల్లాలోని ఏటూరునాగారం పూర్తి ఏజెన్సీ సబ్ డివిజన్ ఈ సబ్ డివిజన్‌లో ఉన్న మండలాలు తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటపురం మండలాలు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటాయి కాబట్టే ఎక్కువగా చలి ప్రభావం ఈ ఏటూరునాగారం సబ్ డివిజన్ లో చూపుతుంది ఏటూరునాగారం సబ్ డివిజన్ చుట్టూ పచ్చని అడవి తల్లి ఒడిలో స్వ చ్చమైన పల్లె వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలు జీవనం సాగిస్తుంటారు.
ఈ సబ్ డివిజన్ ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో శీతాకాలంలో ప్రజలు చలి పంజాతో గజగజలాడుతూ ఒణికిపోతున్నారు పగలు,రేయి అనే తేడా లేకుండా చలి పులిలా ఏజన్సీ ప్ర జలను చలి గాలులుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లవారుజామున, ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం,రాత్రిఅనే తేడా లేకుండా చలి తీవ్రత అత్యధికంగా ఉంది.
ఈ ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితి చూస్తే సూర్యుడు ఎప్పుడు బయటకు వస్తాడు రా! బాబు! అంటూ ప్రజలు ఎదురుచూసే పరిస్థితులు ఉన్నాయి.ప్రజలు తమ నివాస గృ హల సముదాయాల్లో,వీధుల్లో చలి మంటలు వేసుకొని చలి తీవ్రత నుంచి కొద్దిపాటి రక్షణ పొందుతున్నారు చలితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చలి పులి పంజా రూపంలో ప్రజలు ఇళ్లు దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది.ఇంట్లో ఉండి మందం గల దుప్పట్లు,రగ్గులు కప్పుకున్న కూడా ప్రజలు చలి తీవ్రతకు తాళలేని పరిస్థితి సబ్ డివిజన్ ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో ఉంది.
ప్రజలు శ్వాసకోశ సం బంధిత వ్యాధులతో ఇబ్బందిపడే వారికి ప్ర మాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు చలి తీవ్రత సబ్ డివిజన్ లో తీ వ్రంగానే ఉంది చలి తీవ్రతతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ సీజనల్ వ్యాధులకు గుర్యయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏదో కొద్దిగంటలు చలి తీవ్రత అధికంగా ఉంటే ప్రజలు ఏలాగో అలాగా ఇ బ్బందులను అధిగమిస్తూ తమ రోజువారీ పనులు చూసుకుంటారు. చలి పంజా ఏజె న్సీ సబ్ డివిజన్ లో విజృంభించడం వల్లన ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇప్పటికే వృద్ధు లు,పిల్లలు,శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వ దవాఖానాల వైపు,ప్రైవే ట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆరో గ్యంగా ఉన్న పెద్దలు,యువతే చలికి గజగజలాడిపోతున్నారు. ఏది ఏమైనా ఏజెన్సీలోని ప్రజలందరూ విధిగా చలి నుంచి రక్షణ పొందడానికి వైద్యులు సూచించిన పద్దతులు పాటిస్తూ శరీరంను కప్పివేసే దుస్తులు ధరించడం మంచిది అని చెప్పవచ్చు.తగు జాగ్రత్తలు అవసరం
ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం సబ్ డివిజన్ లో చలి తీవ్రత అధికంగా ఉన్న నేపధ్యంలో ప్రజలందరూ విధిగా చలి తీవ్రతగా కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరూచలితీవ్రత నుంచి రక్షణ పొందడానికి శరీరాన్ని కప్పేదుస్తులు, మందపాటి రగ్గులు,దుప్పట్లుతో పాటుగా వేడివేడి ఆహరం,వేడి చేసి చల్లార్చిన సురక్షితమైన త్రాగునీరు వంటివి తీసుకోవడం మంచిదని పలువురు మేదావులు అంటున్నారు.