16-12-2025 12:26:00 AM
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మూసాపేట, డిసెంబర్ 15: ప్రజలకు మంచి చేస్తాం.. గత పదిలు చేసి చూపించడం మీరు చూశారు.. ఎట్టి పరిస్థితుల్లో ముంచే మాటలు చెప్పమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రెడ్డి రాజు తరపున చేపట్టిన ప్రచార కార్యక్రమానికి హాజరై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తున్న అభ్యర్థి రెడ్డి రాజును సర్పంచ్ గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడు తన సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి రెడ్డి రాజు, తోపాటు పార్టీ బలపరిచిన వార్డు సభ్యులు ఉన్నారు.