calender_icon.png 9 January, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుధాన్యాలను విస్తృతంగా ప్రోత్సహిస్తాం

04-01-2026 12:00:00 AM

  1. హెచ్‌కేఎంసీఎఫ్, ఐఐఎంఆర్‌ల మధ్య కుదిరిన ఒప్పందం

అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ  

హైదరాబాద్, జనవరి 3:పోషకాల భద్రతను బలోపేతం చేయడం, స్థిరమైన ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (హెచ్‌కేఎంసీఎఫ్), ఐసీఏఆర్ భారతీయ చి రుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఈయూ) కుదిరింది. ఈ సహకారం ద్వారా పరిజ్ఞానం బదిలీ, వంటకాల అభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా చిరుధాన్యాల (మిల్లెట్స్) ఆధారిత ఆహార కార్యక్రమాలను విస్తృతంగా ప్రోత్సహించనున్నారు. 

ఈ ఎంఈయూ కార్యక్రమం హైదరాబాద్ కోకాపేట్‌లోని హరేకృష్ణ మూవ్ మెం ట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రాంగణంలో నిర్వహించారు.  ఫౌండేషన్ అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్) ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ  అధ్యక్షత వహించారు.అలాగే ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐసీఏఆర్‌ఐఐఎంఆర్) హైదరాబాద్, హెచ్‌కేఎంసీఎఫ్ సీఈఓ కౌంతేయ దాస ప్రభూజీ, ఐఐఎంఆర్, హెచ్‌కేఎంసీఎఫ్ అధికార ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా సత్యగౌర చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ చిరుధాన్యాల ఆధారిత పోషకాహారాన్ని ప్రోత్సహించడంలో ఐసీఏఆర్‌ఐఐఎంఆర్‌తో కలిసి పనిచే యడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరుధాన్యాలు భారతీయ సంప్రదాయ ఆహార సంస్కృతిలో కీలక భాగమే కాకుండా, ఆరోగ్యం, స్థిరత్వం, ఆహార భద్రత వంటి నేటి సవాళ్లను ఎదుర్కోవడానికి అత్యంత అవసరం. ఈ సహకారం ద్వారా మా ఆహార కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినూత్నంగా సమ్మిళితం చేసి సమాజానికి మరింత మేలు చేకూర్చగలమని తెలిపారు.

తారా సత్యవతి మాట్లాడుతూ మిల్లెట్ ఆధారిత సాంకేతికతలు, పోషకాహార పరిశోధన, విలువ జోడించిన ఉత్పత్తుల అభివృ ద్ధిలో ఐసీఏఆర్‌ఐఐఎంఆర్ ముందంజలో ఉందని తెలిపారు. ఈ అవగాహన ఒప్పం దం ద్వారా మిల్లెట్ పండించే రైతులను హెచ్‌కేఎంసీఎఫ్ వంటి పెద్ద స్థాయి సమర్పిత వంటశాలలతో అనుసంధానం చేయ డం సాధ్యమవుతుందని, తద్వారా రైతుల నుంచే నాణ్యమైన ముడిసరకులు నేరుగా అందడంతో పాటు వారి ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు.

ఈ భాగస్వామ్యం ప్రజా ఆహార సరఫరా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా మిల్లెట్లను ప్రజాదరణ పొందే ఆహారంగా తీర్చిదిద్దడం కోసం సమ ర్థ వేదికగా పనిచేస్తుందన్నారు. కాగా పెద్ద ఎత్తున వంటశాలలకు అనుకూలమైన చిరుధాన్యాల ఆధారిత వంటకాల అభివృద్ధి, వా టి ప్రమాణీకరణ, చిరుధాన్యాల ప్రాసెసింగ్, పోషక విలువలు, విలువ జోడింపు అంశాలపై పరిజ్ఞానం బదిలీ,

వంటశాల సిబ్బంది,లబ్ధిదారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పోషకాహారపరంగా సమృద్ధిగా, వాతావరణ మార్పులకు అనుకూలంగా, స్థిరమైన ఆహారంగా చిరుధాన్యాల ప్రోత్సాహం అంశాల్లో ఆ రెండు సం స్థలు కలిసి పనిచేయనున్నాయి. 

ప్రస్తుతం హెచ్‌కేఎంసీఎఫ్ తెలంగాణలో ‘ఇందిరమ్మ కాంటీన్లు’, ‘భోజనామృత’, ఆం ధ్రప్రదేశ్‌లో ‘అన్న కాంటీన్లు’ వంటి రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రజా భోజన పథకాల అమలులో భాగస్వామిగా ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజూ సుమారు 2.5 లక్షల మందికి భోజనం అందిస్తోంది.