13-01-2026 01:35:00 AM
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : గోదావరి నదిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాల్‌చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నామని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం చేసిన మార్గదర్శనానికి అనుగుణంగానే రాష్ర్ట ప్రభుత్వం తరపున సూట్ వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రిట్ పిటిషన్ కంటే సూట్ ద్వారా నే గోదావరి జలాలపై అంతర్ రాష్ర్టలతో సమగ్ర విచారణకు ఆస్కారం ఉంటుందన్న సుప్రీంకోర్టు సూచనల మేరకు రాష్ర్ట ప్రభుత్వం సూట్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
పోలవరం--నల్లమల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు పరిచిన రిట్ పిటిషన్‌పై సోమవారం జరిగిన వాదనలకు ఆయ న స్వయంగా హాజరయ్యారు. అనంతరం సుప్రీంకోర్టు వెలుపల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అంతర్‌రాష్ర్ట జల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నందున తెలంగాణకు చెం దాల్సిన న్యాయమైన నీటి వాటాను కాపాడుకోవడంలో భాగంగానే రాష్ర్ట ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణకు చెందాల్సిన ప్రతీ నీటి బొట్టును పరిరక్షించుకోవడమే రాష్ర్ట ప్రభుత్వం ముం దున్న కర్తవ్యమని, తెలంగాణా హక్కులను కాపాడుకోవడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
గోదావరి జలాశయాలలో అంతర్ రాష్ర్టల ప్రభావాన్ని పరిగ ణనలోకి తీసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ర్ట హక్కులకు భంగం వాటిళ్ల కుండా సమగ్రమైన సమాచారంతో తెలంగాణ రాష్ర్టం తరపున వాదిస్తున్న సీనియర్ సు ప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సంఘ్వి కోర్టు సూచనలకు సూట్ దాఖలు వేయబోతున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే రిట్ పిటిషన్‌ను ఊపసంహరించుకు న్నామని వెంటనే సూట్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు ముమ్మాటికి నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు.
అదే నిర్మాణం జరిగితే తెలంగాణ రాష్ర్టంలోని దిగువ ప్రాంతాలలో నీటి వనరులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నం కావొచ్చని ఆయన చెప్పారు. ఇక్కడ కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేదే ముఖ్యమైన అంశమన్నారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన స్టాప్ ఆర్డర్‌ను కూడా అమలుచేయడం లేదనే విష యాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఏపీకి కేటాయించిన 484.5 టీఎంసీలు.. ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతోపాటు డీపీఆర్ తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అ న్నారు.
ఏపీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లే కుండా ముందుకెళ్తోందనే విషయాన్ని ధర్మాసనం ఎదుట వివరించామని తెలిపారు. ముందుగా డిజైన్ చేసిన దాని కంటే అదనంగా ఏమీ చేయడానికి వీల్లేదని వాదించా మన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఒరిజినల్ ఫామ్‌కు అదనంగా మార్పులు చేయడానికి వీల్లేదని చెప్పామన్నారు. రిట్ పిటిషన్ కాకుండా సూట్ ఫామ్‌లో రావాలని కోర్టు స్పష్టం చేసిందని అన్నారు.
ఈ మేరకు పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని.. తెలంగాణ నీటి హక్కులను కాపాడటం కో సం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఫోరముల్లో ఎక్కడివరకైనా పోరాడుతామని మంత్రి స్పష్టం చేశారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి, భవిష్యత్ తరాలకు ఎటువంటి ఆటం కాలు ఎదురుకాకుండా ఉండేందుకే రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు పరిచనున్నట్టు స్పష్టం చేశారు.