22-01-2026 03:28:02 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 21 (విజయక్రాంతి): నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై నిరాధారమైన ఆరోపణలతో కథ నాలు ప్రచురించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ వేమూరి రాధాకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. భట్టి విక్రమార్క దళితుడనే ఆయనపై కుల వివక్ష చూపిస్తూ, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సింగరేణి ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీస్, ఆల్ ఇండి యా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, స్టేట్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో నేతలు మండిపడ్డారు.
సింగరేణి ఎస్సీ,ఎస్టీ జేఏసీ కన్వీనర్ గోళ్ల రమేష్ తదితరులు మాట్లాడుతూ రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన దళిత నాయకులను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే నైనీ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ భట్టి విక్రమార్కపై తప్పుడు కథనాలు సృష్టించారని విమర్శించారు. పత్రి కా స్వేచ్ఛ ఉంది కదా అని ఊహించుకుని.. లేనిది ఉన్నట్లుగా రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. సదరు సంస్థ ఎండీపై అట్రాసిటీ కేసు పెట్టి, అరెస్ట్ చేసే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. నైనీ బొగ్గు గని టెండర్ల ప్రక్రియలో ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ లే కుండా టెండర్ వేసిన వారిని డిస్ క్వాలిఫై చే శారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సంఘాల నేతలు కొట్టిపారేశారు.