calender_icon.png 22 January, 2026 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెర్సపెన్, భాన్ దేవుళ్లకు పూజలు

22-01-2026 03:30:57 AM

  1. ఇరుముడితో నాగోబాకు మెస్రం వంశీయులు
  2. నాగోబాను దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 21 (విజయక్రాంతి): దివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ ప్రత్యేక పూజలతో నాగోబా జాతర ప్రత్యేకత సంతరించుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతర సందర్భంగా మెస్రం వంశీయుల ఇరుముడి ప్రత్యేకత చాటుకుంటోంది. ఇరుముడి అంటేనే ఆదరికి అయ్యప్ప స్వాములు గుర్తుకు వస్తారు. కానీ మెస్రం వంశస్థులు వందల ఏళ్ల నుండి నాగోబా పూజలకు సంప్రదాయంగా ఇరుముడితో రావడం అనవాయితీ.

నాగోబా జాతర సందర్భంగా పుష్య మాసంలో మెస్రం వంశస్థులు దాదా పు 45 రోజుల పాటు దీక్షలో ఉంటారు. నాగోబా దేవుడి మహా పూజల నాల్గవ రోజున పెర్సపెన్, భాన్ దేవుళ్ళ కు పూజలు నిర్వహిస్తారు. భాన్ దేవతల పూజలకు ఆలయ పీఠాధిపతి సతీమణి మెస్రం లక్ష్మి ఆధ్వర్యంలో పూజలు చేశారు. జాతర సందర్భం గా ఈ నెల 22న జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ రాజర్షి షా సెలవు ప్రకటించారు.