calender_icon.png 7 May, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ బర్తరఫ్‌పై దృష్టిపెడతాం!

25-03-2025 12:00:00 AM

  1. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నాం
  2. మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

గజ్వేల్, మార్చి 24 : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని,  కేసీఆర్ బర్తరఫ్ కోసం న్యాయపరమైన అంశాలపై దృష్టి పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సిద్దిపేట నుంచి రాజ్‌భవన్ వరకు పోరుబాట పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం గజ్వేల్ కాంగ్రెస్ నేతలను తన నివాసానికి రప్పించి మాట్లాడారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల సమస్యలను వారు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన సీఎం నెల రోజుల్లో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని, వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుందామ ని హామీ ఇచ్చారు.

గజ్వేల్‌లోని పెండింగ్ పనులకు నిధులను మంజూరు చేస్తానని హా మీనిచ్చారు. నర్సారెడ్డి ఆరోగ్యం బాగా లేనప్పటికీ పాదయాత్ర చేపట్టడం కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపిందన్నారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి,  నియోజకవర్గ కాంగ్రెస్ ప్ర చార కమిటీ చైర్మన్ రంగారెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాములుగౌడ్, మాజీ జడ్పీటీసీ ప్రభుదాస్ గౌడ్, మాజీ ఎంపీపీలు లక్ష్మారెడ్డి, మోహన్, సలీం, ఆయా మండలాల బాధ్యులు పాల్గొన్నారు