27-08-2025 12:40:34 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): లారీలను అన్లోడ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టిన ఉదoతం కామారెడ్డి జిల్లా ఉప్పల్ వాయి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఉప్పల్ వాయి గోదాంలో లారీలను అన్లోడ్ చేస్తలేరని నిజామాబాద్ జిల్లా లారీ డ్రైవర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏం,డి దావూద్ అలీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి, మోషంపూర్ గ్రామాల మధ్య గల గోదాంలో గత వారం రోజుల నుండి లారీలను అన్లోడ్ చేస్తలేరని లారీ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా లారీ డ్రైవర్ యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్ అలీ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి లారీల ను అన్లోడ్ చేయడం లేదని డ్రైవర్లు ఆగ్రహించి ధర్నా నిర్వహించారు. డ్రైవర్లకు ఇక్కడ కనీసం సౌకర్యాలు కూడా తాగడానికి నీటి సౌకర్యం కూడా లేదని చాయ్ తాగాలన్న మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి అడిగిన ఏం సమాధానం చెప్పకుండా డబ్బులు ఇస్తేనే లారీలను అన్లోడ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్లోడ్ చేయడానికి ఒక్కో లారీకి 4550 రూపాయలు తీసుకుంటూ లారీలను అన్లోడ్ చేయడం లేదని అంతేకాకుండా ఎవరు అదనంగా డబ్బులు ఇస్తారో వారికి త్వరగా అన్లోడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు ఈ సమస్యపై స్పందించి డ్రైవర్లకు న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సివిల్ సప్లై జిల్లా డిఎం గార్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతుందని తెలిపారు. గోదాం ఇన్చార్జి సందీప్ వివరణ కోరగా డ్రైవర్లకు నచ్చజెప్పి రేపటిలోగా 85 లారీలను అన్లోడ్ చేయిస్తానని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ధర్నా విరమించారు.