calender_icon.png 27 August, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసుకోవాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

27-08-2025 12:44:56 AM

వనపర్తి,(విజయక్రాంతి): త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆగస్టు 28వ తేదీన పోలింగ్ కేంద్రాల జాబితాలను  ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో సంబంధిత మండల అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీన  రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. 

గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాల మార్పులపై అభ్యంతరాలపై 28-08-2025 నుండి 30-08-2025 వరకు స్వీకరించాలాన్నారు. ఆగస్టు 31వ తేదీ నాడు  అధికారులచే అభ్యంతరాల పరిష్కారం చేయాలన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ  నాడు జిల్లా ఎన్నికల అధికారుల  ద్వారా చివరి పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.