calender_icon.png 13 September, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేలానికి వెళ్తాం.. బొగ్గు బ్లాక్‌లు సాధిస్తాం

13-09-2025 12:55:07 AM

40 వేల మంది సింగరేణీయుల భవిష్యత్తు ముఖ్యం 

భ్రమలు, అపోహల నేపథ్యంలోనే వేలం పాటలకు సింగరేణి గైర్హాజరు

-ఇటీవల రెండు పెద్ద బొగ్గు బ్లాక్‌లను కోల్పోయాం

-సంస్థ రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది

-కొత్త బ్లాక్‌లు దక్కించుకోకపోతే సంస్థకు గడ్డుకాలం

-పవర్ ప్రజెంటేషన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సింగరేణివ్యాప్తంగా పనిచేస్తున్న 40,000 మంది కార్మికులు, 30 వేల మం ది పొరుగు సేవల సిబ్బంది భవిష్యత్తు దృ ష్ట్యా యాజమాన్యం ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాక్‌లు, ఇతర ఖనిజాల గనుల వేలం పాటకు హాజరవుతుందని, ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వేలానికి వెళ్లి కొత్త బ్లాక్‌లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడారు. బొగ్గు వేలం పాటల్లో సంస్థ పాల్గొనకపోవడం వల్ల సింగరేణికి సత్తుపత్తి, కోయగూడెం వంటి రెండు పెద్ద బొగ్గు బ్లాక్‌లు దక్కకుండా ప్రైవేటు సంస్థకు దక్కాయని వాపోయారు. తద్వారా సంస్థ రూ. 60 వేల కోట్ల గ్రాస్ రెవెన్యూ కోల్పోయిందని, దానిలో నికరంగా రూ.15 వేల కోట్లు కోల్పోయినట్లయిందన్నారు. వేలంలో పాల్గొని సంస్థ మున్ముందు మరి న్ని బొగ్గు బ్లాక్‌లు దక్కించుకోపోతే గడ్డుకాలం తప్పదని జోస్యం చెప్పారు. వేలంలో ప్రైవేటు వ్యక్తులు బొగ్గు బ్లాక్‌లను దక్కించుకున్నా, రాష్ట్రప్రభుత్వానికి రాయల్టీ వస్తుందని స్పష్టం చేశారు. కానీ, సింగరేణి పరిధిలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్తు ప్రశార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి పరిధిలో ప్రస్తుతం 38 గనులు ఉన్నాయని, వాటి పరిధిలో రోజురోజుకూ బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయని, మరో ఐదేండ్లలో 10 గనులు మూతపడే అవకాశం ఉందని తేల్చిచెప్పారు.

పది గను లు మూతపడితే 8 వేల ఉద్యోగాలకు ఎసరు వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి 72 మిలియన్ టన్నులు ఉందని తెలిపారు. కొత్త బ్లాక్‌లు దక్కించుకపోతే మున్ముందు ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయ పడ్డారు. మున్ముందు కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా సింగరేణి థర్మల్ విద్యు త్తు, సోలార్ విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను నెలకొల్పుతుందని తెలిపారు. అం దుకు ఇప్పటికే సంస్థ ఒక కన్సల్టెన్సీని సైతం నియమించుకున్నదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ కీలక ఖనిజాల వెలికితీ తకు అవకాశం ఉందో, సంస్థ త్వరలో ఒక ఏజెన్సీ ద్వారా అధ్యయనం చేయిస్తుందన్నా రు. ఏజన్సీ ఇచ్చే లాభదాయక సూచనలను పరిగణనలోకి తీసుకుని ‘సింగరేణి గ్లోబల్’ పేరుతో ప్రపంచంలోని పలు దేశాల్లో కీలక ఖనిజాలను వెలికితీయనున్నదని వెల్లడించారు.

దీనిలో భాగంగానే ఇటీవల సంస్థ కర్ణాటకలోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగా రం, రాగి అన్వేషణకు 37.75 రాయల్టీతో లైసెన్స్ సాధించిందని గుర్తుచేశారు. అన్వేషణ తరువాత ఆ ప్రాంతంలో ఎవరు బంగా రం వెలికితీసినా, ఆ గనుల నుంచి జీవితకాలం సంస్థకు 37.75 శాతం రాయల్టీ వస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సంస్థకు ఏడాదికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, అం దుకు అనుగుణంగానే కార్మికులు, అధికారులు నైపుణ్యాలు కలిగి ఉన్నారని వివరిం చారు. కొత్త బొగ్గు బ్లాక్‌లు దక్కించుకోకపోవడంతోనే అంత మొత్తంలో బొగ్గు ఉత్పత్తి చేయలేకపోతున్నామని తేల్చిచెప్పారు. బొగ్గు బ్లాక్‌ల వేలం పాటకు సంస్థ హాజరయ్యేందుకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపడం ఆనందాన్నిచ్చిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణారావు, సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల వేతనాలు పెంచాలని వినతి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని, లాభాల వాటా రూ. 20 వేలు చెల్లించాలని, పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రా క్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. శుక్రవారం ప్రజాభవన్‌లో కు వచ్చిన కాం ట్రాక్టు కార్మికులు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కార్మికుల వినతిపై డి ప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హా మీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి పలువురు జేఏసీ నా యకులు కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి, సింగరేణీ సీఎండీ ఎన్.బలరామ్ ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. 

జిల్లాలకు ‘డీఎంఎఫ్‌టీ’ నిధులు

పాఠశాలల నిర్వహణ, శానిటేషన్ వసతుల కల్పనకు సింగరేణి యాజమాన్యం ఇటీవల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ) ఖాతాలో రూ.146.69 కోట్లు జమ చేసింది. సొమ్ము వినియోగంపై పాఠశాల విద్యా శాఖ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు అందాయి. ఏ జిల్లాకు ఫండ్ అందిందనేది విద్యాశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఆ సొమ్మును అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) అకౌంట్లలో తిరిగి జమ చేయాలని ఆదేశించింది. ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేసింది.

సంస్థను బతికించుకోవాలి..

సింగరేణిని బతికించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని, కార్మి సంఘాలు, కార్మికులంతా కలిసి సంస్థను కాపాడుకోవాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్గ పిలుపునిచ్చారు. సచివా లయం లో శుక్రవారం ఆయన సింగరేణి కార్మిక సంఘాల నేతలో భేటీ అయ్యారు. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విద్యుత్ సంస్థలు ఎక్కడ బొగ్గు ధరకు బొగ్గు లభిస్తే, అక్కడ బొగ్గు కొనేందుకు మొగ్గు చూపుతున్నాయని, ఈ తరుణంలో సింగరేణి ఉత్పత్తి చేసి విక్రయించ లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదన్నారు. కార్మిక సంఘాలు వీటన్నింటిపై అవగాహన లేకుండా గుడ్డిగా ముందుకెళ్లొద్దని హితవు పలికారు.