08-07-2025 01:51:14 AM
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడా, యువజనశాఖ మంత్రి వాకిటి శ్రీవారి
కరీంనగర్, జూలై 7 (విజయ క్రాంతి): మత్స్యశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడా, యువజనశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క రీంనగర్ పట్టణంలోని ఉజ్వల పార్కు సమీపంలో చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని సోమ వారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రితో కలిసి పరిశీలించారు. అనంతరం మత్స్యకారుల సక్షేమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ఈ సంద ర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపపిల్లల పంపిణీలో లెక్కపెట్టలేరని తక్కువ చేప పిల్లలు వేసేవారని అ న్నారు. గతంలో ఈ శాఖలో జరిగిన అవినీతివల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడ్డార న్నారు. మొదటిసారి ముదిరాజ్ బిడ్డను ము ఖ్యమంత్రి మత్స్యశాఖ మంత్రిని చేశారని అ న్నారు. గతంలో ఉన్న అవినీతి మచ్చను తొ లగించడానికి ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు.
మత్స్యశాఖ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. 80-110 ఎంఎం ఉన్న చేప పిల్లలను పంపిణీ చే స్తామని, చేపలు ప్రకృతి ఇచ్చిన సంపదన అ న్నారు. త్వరలోనే కేబినెట్లో చేప పిల్లల పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రం లో 87 కోట్ల చేప పిల్లలు వేసుకునే విధంగా చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు ఉన్నాయన్నారు. కరీంనగర్ పోరాటాల గడ్డ అని ఇక్క డి వారికి మంచి ఆలోచన విధానం ఉందన్నారు.
ఇక్కడ చేపపిల్లల ఉత్పత్తి బాగుందని దానిని మరింత విస్తరిస్తామన్నారు. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచుతామన్నారు. విద్యా, ఉద్యోగాల్లోనే కా కుండా రాజకీయాల్లో కూడా బడుగులకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ అ న్నారని గుర్తు చేశారు. కుల గణన చేసే అవకాశం, బీసీ బిల్లు పెట్టే అవకాశం మంత్రి పొ న్నం ప్రభాకర్ కు దొరికిందని, కుల గణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంత అనేది శాస్త్రీయంగా తెలిసిందన్నారు.
పెరిగిన చేప రేటు వచ్చిన తర్వాత అమ్ముకునే విధం గా కోల్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని, అది కరీంనగర్ నుంచే ప్రారంభిస్తామన్నారు. మో పెడ్, బండ్లు చేపలు అమ్ముకునే విధంగా ఉండడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ సంవత్సరం 82 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తామన్నారు. ము దిరాజ్ కార్పొరేషన్, ఫషరీస్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయని, తెలంగాణలో చేపల ఉ త్పత్తిలో నెంబర్ వన్ ఉండేలా కార్యక్రమాన్ని తీసుకుంటామన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, ర వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మా ట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో చేప పిల్లల పంపిణీ, కొనుగోలు, మత్స్యశాఖలో అవినీతి జరిగిందనే కారణంతో మొదటి సంవత్సరం చేప పిల్లల పంపిణీ కొంత ఆలస్యం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య సం పద మీద వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, నాచురల్గా పెరిగిన చేపలు మంచి ఆహారాన్ని అందిస్తాయన్నారు.
చేపల ఉత్పత్తికి సంబంధించిన ప్రభుత్వం పక్షాన మత్స్య సంపద పెంచడానికి ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యాం, మి డ్ మానేరు, ఎల్లంపల్లి, అనేక గొలుసుకట్టు చెరువుల నుంచి చేపల పెంపకాన్ని పెద్ద ఎ త్తున పెంచుతున్నారని అన్నారు. ఇక్కడినుం చి అనేక ప్రాంతాలకు చేపల ఎగుమతి జరుగుతుందన్నారు. గతంలో ఉన్న దానిని మ రింత పెంచుతామన్నారు.
నాలుగు జిల్లాల కేంద్రంగా ఈ చేప పిల్లల పెంపకంకేంద్రంగా ఉందన్నారు. మత్స్య సంపదకు కరీంనగర్ కేంద్రంగా ఉందన్నారు. చేప పిల్లల పెంపకం, ఉత్పత్తికి ప్రభుత్వం తరపున మార్కెట్లు పెంచ డం, ఎగుమతులకు సహకారం ఇవ్వడం జ రుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ పమే లా సత్పతి, తదితరులుపాల్గొన్నారు.