calender_icon.png 8 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాజీపేటలో 58వ జాతీయస్థాయి ఖోఖో పోటీలు

06-01-2026 12:00:00 AM

తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 11న ప్రారంభం

ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం 

హనుమకొండ, జనవరి 5 (విజయక్రాం తి): భారత ఖోఖో ఫెడరేషన్ సౌజన్యంతో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజులపాటు కాజీపేటలోని రైల్వే స్టేడియంలో అట్టహాసంగా 58వ జాతీయస్థాయి ఖో ఖో పోటీలను నిర్వహించనున్నామని తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షు లు,రాష్ట్ర ఆయిల్ఫేడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే స్టేడియంలో సోమవారం నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి నాతీ కృష్ణమూర్తి తో కలిసి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి సీనియర్స్ మహిళలు పురుషుల ఖోఖో పోటీలలో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు,రైల్వే,ఎయిర్పోర్ట్ అథారిటీ,ఆల్ ఇండియా పోలీస్,కేంద్ర బెటాలియన్స్ నుంచి 40 పురుషుల జట్లు 39 మహిళల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీలను ఘనంగా నిర్వహిం చేందుకు రైల్వే స్టేడియంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోటీలను పగలు రాత్రి నిర్వహించేందుకు గాను భారీ ఎత్తున ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అలాగే ఖో ఖో, క్రీడ ప్రపంచ స్థాయి క్రీడగా మారిందని,ఈ గ్రామీణ క్రీడ ఇప్పుడు మ్యాట్లపైకి వచ్చిందన్నారు. ఈ పోటీలను మ్యాట్లపై నిర్వహించేందుకు గాను 4 సింథటిక్ కోర్టులను,2 క్లే కోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులతో పాటు అధికారులు అందరికీ కూడా 7  రోజులపాటు ఉచిత భోజన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మహిళా క్రీడాకారులకు రామన్ హైస్కూ ల్, ఎం జె పి హై స్కూల్, నారాయణ జూనియర్ కళాశాల, అక్షర హైస్కూల్‌లలో పురు షు క్రీడాకారులకు తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాల,మాస్టర్ జి ఉన్నత పాఠశాల, బిషప్ బరేట్ట హై స్కూల్, రామప్ప పోలీస్ అకాడమీ,రైల్వే ట్రైనింగ్ సెంటర్,జెఎన్‌ఎస్ హనుమకొండ, రామప్ప ఇంజనీరింగ్ కళాశాలలో వసతి ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈనెల 11న సాయంత్రం నా లుగు గంటలకు పోటీలను ఘనంగా ప్రారంభించనున్నామన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యేందుకు అవకాశాలున్నాయన్నారు.

ఈ పోటీలను ఘనంగా నిర్వహిం చేందుకు తోడ్పాటు అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షులు కైలాస్ యాదవ్, పోటీల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి,జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాం ప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షులు కుసుమ సదానందం,సంయక్త కార్యదర్శి. ఎం రమణ, రాజారపు రమేష్,శ్రీనివాస్, తెలంగాణ ఖోఖో సంఘ రెఫ్రిజ్ బోర్డ్ కన్వీనర్ వి. సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.