calender_icon.png 30 October, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాపై విమర్శలు చేస్తే సహించేది లేదు

30-10-2025 01:48:17 AM

ఎమ్మెల్యేపాయల్ శంకర్ 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీ పార్టీ గురించి చూసుకోవాలి కానీ, తమ పార్టీ నేతలపై విమర్శలు చేస్తే సహించేది లేద ని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శం కర్ అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఓటమి తప్పదని కాంగ్రె స్ మంత్రులకు అర్థమైనట్టుందని,

కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులపై చర్చకు పొన్నం సిద్ధమా..? అని సవాల్ విసిరారు. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని సర్వే లు చెబుతున్నాయని, కాబట్టే బీజేపీపై నిం దలు వేసి పబ్బం గడుపుకుంటున్నారన్నారు.