calender_icon.png 1 May, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ భూములను కాపాడకుంటే ఉద్యమిస్తాం

30-04-2025 12:00:00 AM

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్

కల్వకుర్తి ఏప్రిల్ 29 :కల్వకుర్తి మండలం రఘుపతి పేట రామగిరి దేవాలయ భూములను కాపాడాలని రఘుపతి పేట గ్రామ స్తులతో కలిసి, బిజెపి నాయకులు రాష్ట్ర దే వాదాయ శాఖ అడిషనల్  కమిషనర్  కృష్ణవేణికి ఫిర్యాదు చేశారు.

రామగిరి రాముల వారి దేవాలయ భూమి 540 ఎకరాలు ఉం డగా, అందులో  100 ఎకరాలకుపైగా ఉన్న గుట్టను కొంతమంది కాంట్రాక్టర్ లు  ఇష్టారీతిన ఎలాంటి అనుమతులు లేకుండా మ ట్టిని అక్రమంగా తరలిస్తూ అన్యాక్రాంతమైన దేవాదాయ భూములకు కాపాడాలని స్థాని క ఆర్డిఓ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసినప్పటికీ ఎలాంటి మార్పు లేదని  ఫిర్యాదులో పేర్కొన్నారు.

దేవాలయల  భూములను కాపాడుతూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, మట్టిని అక్రమంగా తవ్విన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట మండల అధ్యక్షులు నరేష్, టౌన్ మా జీ ప్రెసిడెంట్ బోడ నరసింహ, పిఏసిఎస్ వైస్ చైర్మన్ శ్యామ్ సుందర్, రఘుపతి పేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.