calender_icon.png 1 May, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

30-04-2025 12:00:00 AM

కలెక్టర్ బీఎం సంతోష్

గద్వాల, ఏప్రిల్ 29 ( విజయక్రాంతి ) : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.మంగళవారం మల్దకల్  మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణతో కలిసి జిల్లా కలెక్టర్  పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్న ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని, కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన పలు రికార్డులను, ఓపీఎంఎస్ యాప్ లో ఆన్లైన్ ఎంట్రీ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సం బంధించి అన్ని వివరాలు రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.

వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలలో సేకరించిచే ధా న్యానికి వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఆన్ లైన్ నమోదు ప్రక్రియ ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి, స్వయంగా డిజిటల్ తేమ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించి, కొ నుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే కాంటా వేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలని అన్నారు.

ఈ కార్య క్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమా ర్, మండల వ్యవసాయాధికారి రాజ్ శేఖర్, పి.ఎ.సి.ఎస్ చైర్మన్ కిరణ్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.