calender_icon.png 13 October, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు బాధితులందరికీ పరిహారం అందిస్తాం

13-10-2025 12:00:00 AM

మంత్రి గడ్డం వివేకానంద

చెన్నూర్, అక్టోబర్ 12 : కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన అర్హత కలిగిన ముంపు బాధితులు అందరికీ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గను లు భూగర్బ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం చెన్నూరులోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో కోటపల్లి మం డలం బబ్బెర చెలక, దేవులవాడ గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఆర్డీఓ  శ్రీనివాస్ రావు, కోటపల్లి మండల తహసిల్దార్ రాఘవేంద్రలతో కలిసి ఆయన మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భూము లు కోల్పోయిన అర్హులైన బాధితులు అందరికీ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చట్ట ప్రకారం అర్హులైన బాధితులకు పరిహారం అందిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు 36 వేల కోట్ల రూపాయల అంచ నా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ. 11 వేల కోట్లతో పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 25 వేల కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంతంలో 55 వేల ఎకరాల ఆయకట్టు భూమిలో రైతులు అధిక దిగుబడితో పంట సాగు చేసేవారని, భూములు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు.

ఎలాంటి వివాదాలు లేని భూములకు అవా ర్డు జారీ చేయడం జరుగుతుందని, డిసెంబర్ 18, 19 తేదీలలో అర్హులైన వారికి అం దించడం జరుగుతుందన్నారు. 33 కోట్ల రూ పాయలలో 5 కోట్ల రూపాయలు మంజూ రు చేశామని, మరో రూ. 5 కోట్లు పి.డి. ఖాతాలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.