calender_icon.png 11 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి లబ్ధిదారుడి వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

10-10-2025 12:37:29 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్, అక్టోబరు 9 (విజయ క్రాంతి): చివరి లబ్ధిదారుడి వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని రేకుర్తి బుడిగె జంగాల కాలనీలో పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్దారుల ఇండ్లకు సుడా చైర్మన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఉన్న చివరి లబ్దిదారుని వరకు ఇండ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఆలస్యమైనందున అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని మిగిలిన అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అస్తపురం రమేష్, పర్వతం మల్లేశం, అస్తపురం తిరుమల, మ్యాక శ్రీనివాస్, దుబ్బుల రాజయ్య, లింగంపల్లి లచ్చయ్య, తదితరులుపాల్గొన్నారు.