calender_icon.png 23 May, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ డీజీపీపై బదిలీ వేటు

06-05-2024 12:24:17 AM

వెంటనే విధుల నుంచి వైదొలగాలని ఈసీ ఆదేశం

అమరావతి, మే 5: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణ మే విధుల నుంచి వైదొలగాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులను అప్పగించొద్దని సీఎస్ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల లోపు ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన జాబితా పంపాలని సూచించింది. వారికి సంబంధించి గత ఐదేళ్ల పనితీరు, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను పంపాలని ఆదేశించింది. ప్రతిపక్షాలు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఆయనపై బదిలీవేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.