calender_icon.png 18 October, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటగుళ్లకు పూర్వవైభవం తెప్పిస్తాం

18-10-2025 12:07:41 AM

-55 కోట్లతో పునర్నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు

-ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతాం 

-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూ బాబాద్), అక్టోబర్ 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి మండలం గణ పురంలోని కాకతీయుల కాలంనాటి కోట గుళ్ళకు నాటి పూర్వ వైభవాన్ని తెప్పించ డానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు తెలిపారు.రాష్ట్ర పురావస్తు మ్యూజియం శాఖ డైరెక్టర్ అర్జున్ రావుతో కలిసి శుక్రవారం పూట గుళ్లను సందర్శిం చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపురం మండల కేంద్రంలోని  కాకతీ యుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ  సముదాయం పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తెచ్చి భావితరాలకు అందిస్తామని తెలిపారు. 55 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఇంకా 25 కోట్లు అవసరం ఉన్నాయని, డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. నియో జకవర్గంలోని పాండవుల గుట్టలు, కొడవ టంచ, బుగులోని వెంకటేశ్వర స్వామి క్షేత్రా లు, మైలారం గుట్టలకు నిధులు మంజూరు చేయించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పురావస్తు శాఖ డైరెక్టర్  అర్జున్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే  సూచనల మేరకు భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. కోటగుళ్ల సందర్శన అనంతరం మండల కేంద్రంలో రెడ్డి గుడిని సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. త్వరితగతిన రెడ్డి గుడి సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పిం చాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశిం చారు. ఈ  కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఇన్చార్జ్ నర్సింగ్  నాయక్ , నాగరాజు అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.