06-11-2025 06:47:52 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అందుగుల పేట గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోచమ్మ తల్లి నూతన ఆలయం ప్రారంభించిన సందర్భంగా విగ్రహ నూతన ప్రతిష్టాపన ఉత్సవాలు గత ఐదు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా చివరి రోజు గురువారం గ్రామస్తులంతా తమ ఇండ్ల నుండి బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి నియమ నిష్ఠలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని కోరుతూ గత ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించ డం జరిగిందన్నారు. చివరి రోజు గ్రామస్తుల సహకారంతో బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వ హించామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కొండపర్తి సందీప్, రామ్మూర్తి, శ్రీనివాస్, మల్లేష్, గ్రామ పెద్దలు, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.