30-09-2025 02:14:12 AM
ఓటుకు నోటు కేసులో ఏ-4 బాధితుడుగా తప్పించబడిన జెరూసలేం మత్తయ్య
ముషీరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఓటు విలువ కాపాడటానికి త్వరలో సంస్థను ఏర్పాటు చేసి పోరాటం చేయనున్నట్లు ఓటుకు నోటు కేసులో ఏ-4 బాధితుడుగా ఉండి కేసునుంచి ఇటీవల తప్పించబడిన జెరూసలేం మత్తయ్య ప్రకటించారు.
ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జెరూసలేం మత్తయ్య మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో 2015 మే 31 న తెలంగాణ ఎసిబి, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి 26 సెప్టెంబర్ 2025 సుప్రీం కోర్టులో తన ప్రమేయం లేదని కేసు కొట్టివేసే వరకు, సుమారు పదేళ్లగా తాను తీవ్ర అవమానానికి గురయ్యా నని, ఎంతో పరువునష్టం కలిగిందన్నారు.
ఎసిబి కోర్టులు, సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, వివిధ పోలీ సు స్టేషన్‌లు, టిడిపి పార్టీ ఆఫీసుల చుట్టూ తిరగటం వల్ల విలువైన సమయంతో పాటు చాలా డబ్బు లు ఖర్చయిందని అన్నారు. ఈ విషయంలో తాను అతి త్వరలో నాం పల్లి కోర్టులో మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మీద పరువునష్టం దావాతో పాటు తెలంగాణ ఎసిబి, పోలీసు అధికారుల మీద సాం కేతిక నష్టపరిహారం దావా దాఖలు చేయనున్నట్లు మత్తయ్య తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు, వేం నరేందర్ రెడ్డి, లోకేష్ బాబు లకు లీగల్ నోటిస్ పంపిస్తానని తెలిపారు. నష్టపోయిన 10 ఏళ్లకు పది కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఎసిబి దర్యాప్తు సంస్థలను, కోర్టు వ్యవస్థలను ప్రభావితం చేసి కేసుల నుండి తప్పించుకుంటున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై న్యాయపోరాటం ప్రారంభించనున్నట్లు తెలిపారు.