30-09-2025 02:15:29 AM
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ ఆధ్వర్యంలో 2కే వాకథాన్ నిర్వహించారు. రూ.999 ప్యాకేజీని డాక్టర్ జి జగన్నాథ్- ఆర్సీపురం సీఐ డాక్టర్ రవీంద్ర ఏ- ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యూనిట్ హెడ్ మల్లేష్ ప్రారంభించారు. ఈ ప్యాకేజీలో ఈసీజీ, 2డీ ఎకో, టీఎంటీ, లిపిడ్ ప్రొఫైల్, క్రియాటినిన్, రాండమ్ బ్లడ్ షుగర్, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.