calender_icon.png 16 September, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యార్థులకు అండగా ఉంటాం

16-09-2025 12:53:01 AM

-అడ్మిషన్ల విషయంలో ఇబ్బందులుంటే సంప్రదించాలి

-నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణచారి

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): వైద్య విద్యార్థుల అడ్మిషన్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నీట్ పేరెం ట్స్ అసోసియేషన్‌ను సంప్రదించొచ్చని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణచారి తెలిపారు. వైద్య విద్యార్థుల సమస్యలను తీర్చడంలో ముందంజలో ఉంటామన్నారు. సోమవారం నాగోల్‌లోని పల్లవి ఇంజనీర్ కళాశాలలో నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా  సత్యనారాయణచారి మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతే వారికి సహకరించేందుకు ప్రతి జిల్లాలో సైతం తమ అసోసియేషన్ సభ్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. గతంలో తాము చేసిన ఉద్యమం ద్వారా నాలుగు నుంచి ఐదు వందల మంది స్థానిక విద్యార్థులు మెడికల్ సీట్లు పొందారని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ముఖ్య సలహాదారు బీరెల్లి కమలాకర్ రావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పొడిశేట్టి రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.