calender_icon.png 16 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వస్థ నారిశక్తి పరివార్‌ను విజయవంతం చేయాలి

16-09-2025 12:52:25 AM

నిర్మల్, సెప్టెంబర్ ౧౫ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్త్ నారి  స్వశక్తి పరివార్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం పై మాట్లాడారు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మహిళలకు రక్తహీన త, బిపి, థైరాయిడ్, టిబి, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నిపుణ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు.

అలాగే, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వర కు జరగనున్న పోషణ్ మా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించి ఎనీమియా ముక్త నిర్మల్ సాధించాలని సూచించారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధా నాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ వందశాతం హాజరు కావాలన్నదే తమ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతకుముందు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.