calender_icon.png 14 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రావణి కుటుంబానికి అండగా ఉంటాం

14-11-2025 01:01:45 AM

  1. అట్రాసిటీ కేసు కింద పరిహారాన్ని అందిస్తాం

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్,నవంబర్ 13(విజయక్రాంతి):అక్టోబర్ 18వ తేదీన దహేగాం మండలంలో గెర్రే గ్రామంలో హత్యకు గురై న శ్రావణి తల్లిదండ్రులకు అన్ని విధాలుగా అండ గా ఉంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.

గురువారం  జిల్లా కలెక్టరేట్‌లో ఎస్.పి.కాంతిలాల్ సుభాష్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్  ఎం. డేవిడ్,  కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావు, కాగజ్ నగర్ డి.ఎస్.పి. లతో కలిసి శ్రావణి కుటుం బ సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్య నుండి 1 లక్ష రూపాయల రుణ చెక్కు, అట్రాసిటీ కేసు పరిహారం ఉత్తర్వులు, 3 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించే ఉత్తర్వులను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హత్యకు గురైన శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలు గా ఆదుకుంటామని, శ్రావణి తండ్రి చెన్న య్య పేరిట ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి మండల సమా ఖ్య నుండి 1 లక్ష రూపాయల రుణం చెక్కును అందిస్తున్నామని, త్వరగా ఇంటి నిర్మాణాన్ని ప్రారం భించాలని తెలిపారు.

అట్రాసిటీ కేసు క్రింద పరిహారాన్ని అందిస్తున్నామని, మొదటి విడతగా 4 లక్షల 12 వేల 500 మంజూరి ఉత్తర్వులను అందించడం జరిగిందని తెలిపారు. శ్రావణి తండ్రి ఖాతాలో డబ్బులను జమ చేయడం జరుగుతుందని, శ్రావణి కుటుంబానికి 3 నెలలపాటు నిత్యవసర సరుకులు అం దించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వపరంగా అందవలసిన వాటిని అందజేస్తు న్నామని, శ్రావణి తల్లిదండ్రులకు ఉపాధి కొరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏదైనా దుకాణం పెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శ్రావణి తమ్ముడిని గురుకుల పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎస్.పి. మాట్లాడు తూ శ్రావణిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రక్షణ పరంగా శ్రావణి కుటుం బానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉం టుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పి.డి. ప్రకాష్‌రావు, జిల్లా గ్రామీ ణ అభివృద్ధి అధికారి దత్తారావు, దహేగాం మండల తహసిల్దార్ షరీఫ్, మం డల పరిషత్ అభివృద్ధి అధికారి నస్రుల్లా, ఎస్.ఐ. విక్రమ్, శ్రావణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.