calender_icon.png 27 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి అండగా ఉంటాం..

27-01-2026 12:07:19 AM

మంత్రి దామోదర రాజనర్సింహ 

నిజామాబాద్ జనవరి 26 (విజయక్రాంతి): గంజాయి ముఠా ఘాతుకంలో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికిఅండగా ఉంటామని రాష్ట్ర  మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సౌమ్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం పరామర్శించారు. ఆమె కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాల ఆదుకుంటామన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ఉదయం పరామర్శించారు. సౌమ్య ఆరోగ్య విషయమై ఆస్పత్రి డైరెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి నీ నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఇతర వైద్యులు మంత్రికి వివరించారు.

గంజాయి ముఠా దాడిలో సౌమ్యకు తీవ్రంగా గాయపడడం బాధగా ఉందన్నారు. సౌమ్య కుటుంబ సభ్యులకు ఉద్దేశించి మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, సౌమ్య పూర్తిగా కోలుకుంటుందనన్నారు. సౌమ్య పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎక్సైజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో నిజామాబాద్ లో జరిగిన ఘటన దురదృష్టకరన్నారు.

ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగైనప్పటికీ, ఇంకా ఆమె కండీషన్ క్రిటికల్గానే ఉందని మంత్రి తెలిపారు. నిమ్స్ సీనియర్ వైద్యుల బృందం ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. సౌమ్య సంపూర్ణంగా కోలుకుటుందని ఆశించారు. ఆమె కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. నిందితులపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.