calender_icon.png 27 January, 2026 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణతంత్ర వేడుకలు

27-01-2026 12:09:00 AM

మహబూబాబాద్,జనవరి 26 (విజయక్రాంతి):ప్రసిద్ధిగాంచిన జయశంకర్ భూపా లపల్లి జిల్లా గణపురం చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాల యం కోటగుళ్లలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సో మవారంగణపే శ్వర స్వామిని కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం రూపంలో ప్ర త్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతా ల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

కాకతీయ యూనివర్సిటీ, జనవరి 26 ,(విజయక్రాంతి): సమష్టి కృషితో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముం దుకు తీసుకెళ్లే దిశగా సాగుతున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచా ర్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం సారథ్యంలో పరిపాలన భవన ప్రాంగణంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైస్ చాన్సలర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్సీసీ కాడెట్ల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. అనంతరం జాతీయ జెం డాను ఆవిష్కరించి బోధన, బోధనేతర ఉ ద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాం త ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా, అకడమిక్, నిర్వహణ పరమైన సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు.

యూనివర్సిటీ లక్ష్యాలు వికసిత్ భారత్, రైజింగ్ తెలంగాణ దిశగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశోధన లకు ప్రోత్సాహం అందించే దిశగా తొలిసారిగా అవార్డులు ప్రవేశపెట్టామని, వీటిలో బెస్ట్ పరిశోధన పాత్రలు, ప్రాజెక్ట్, పేటెంట్ల కు నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందిచామన్నారు.

ముఖహాజరు గుర్తింపు విధానం అమల్లోకి వచ్చిందని, రూసా నిధులను వినియోగంలోకి తీసుకొచ్చామని తెలి పారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి స భ్యులు ఆచార్య బి. సురేష్లాల్, డాక్టర్ బి. రమ, డాక్టర్ ఎన్. సుదర్శన్, డాక్టర్ చిర్రా రా జు, డాక్టర్ బి. సుకుమారి తదితరులు పాల్గొన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశో ధకులు, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్ల్లాల సంయోజకులు గా వ్యవహరించారు.

పిల్లలతో కలిసి గణతంత్ర వేడుకల్లో ‘వేం’ సందడి

కేసముద్రం, జనవరి 26 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తాను జన్మించిన కేసముద్రం మండలంలోని అర్పణప ల్లిలో సోమవారం గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన గణతంత్రదినోత్సవ వేడుకల్లో చిన్నారులతో కలిసి పాల్గొని సందడి చేశారు. రాష్ట్రంలో అతి ముఖ్యమైన కీలక పదవిలో ఉండి, క్షణం తీరిక లేని పరిస్థితుల్లో అమ్మలాంటి తన జన్మభూమిలో చిన్నారి విద్యా ర్థులు, గ్రామస్తులతో కలిసి చాలా సాదా సీదాగా తమలో ఒకడిగా జెండాపండుగలో పాల్గొన్న వేం నరేందర్ రెడ్డి ని చూసి గ్రామస్తులు సంతోషపడ్డారు.

కేసముద్రం, జనవరి 26 (విజయక్రాంతి): గణతంత్ర వేడుకలు మహబూ బాబాద్ జిల్లా కేసముద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కె ట్లో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావు, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీడీవో క్రాంతి, రైతు వేదికలో ఏవో వెంకన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జండా వందనం చేశారు. ఆయా కార్యక్రమా ల్లో మార్కెట్ ప్రత్యేక కార్యదర్శి అమరలింగేశ్వర్ రావు, ఉప తహసిల్దార్ ఎర్రయ్య తది తరులు పాల్గొన్నారు.

మరిపెడలో..

మరిపెడ, జనవరి 26 (విజయక్రాంతి)మరిపెడ మండలం కేంద్రంతోపాటు అన్ని గ్రా మాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీ య జెండాలు ఎగరవేసి, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయా లతో పాటు వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిం చారు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్,తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కృష్ణవేణి, మండల పరిష త్ కార్యాలయంలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వీరా సింగ్, మరిపెడ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవి నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జండా వందనం చేశారు.

 జాతీయ జెండా ఆవిష్కరణ

తరిగొప్పుల, జనవరి 26 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా తరిగొప్పుల మండలం అంతా మువ్వన్నెల జెండాతో రెపరెపలాడింది. ప్రతీ ఒక్కరూ మువ్వన్నెల జెండాను పట్టుకుని స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. జాతీ య జెండాను ఆవిష్కరించి కన్నుల పండువగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

తరిగొప్పుల పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కా ర్యాలయం, అబ్దుల్ నాగారం గ్రామపంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాల యం మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనం గా జరిగాయి.

తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో....

మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్త్స్ర గూగులోత్ శ్రీదేవి జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మార్వో కార్యాలయంలో..

మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్స వం ఘనంగా జరిగింది. ఎమ్మార్వో మైపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో రామారావు, ఆర్ ఐ ఆంధ్రయ్య, సత్యం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 

అబ్దుల్ నాగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో..

అబ్దుల్ నాగారం గ్రామ పంచాయతీలో కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ కార్యదర్శి కంకటి రవీందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కావటి సుధాకర్, ఉప సర్పంచ్ నీల సంపత్, అర్జుల సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, జీ.పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

కస్తూర్బా పాఠశాలలో..

మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సునీత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బం ది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వెంకటాపూర్, జనవరి26(విజయక్రాంతి): మండల వ్యాప్తంగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ-ప్రైవేటు పాఠశాలల్లో గణతంత్ర దినోత్స వాన్ని ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, కార్యదర్శులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అలాగే పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలమంతా దేశభక్తి వాతావరణంతో మార్మోగింది.

తహసీల్దార్ కార్యాలయంలో..

తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మార్వో గిరిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ విలువలు, దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రజల పాత్రపై ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకులు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభ క్తి, కర్తవ్యబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం విద్యార్థుల్లో విద్యపై ఆసక్తి పెంపొం దించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ను పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో డిటీ రాజకుమారి, సీనియర్ అ సిస్టెంట్ రవీందర్, గిర్దావర్లు రమేష్, సుధాకర్, సర్వేయర్ సుచిత్ర, ఎంపిఎస్ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్స్ రమేష్, కరుణాకర్, సిబ్బందిలు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయంలో..

ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఓ మూడు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మూడు రాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులను ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టాలని సూచించారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రజాస్వామ్య విలువలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బందీలు పాల్గొన్నారు.

ఘనంగా గణతంత్ర వేడుకలు

వెంకటాపురం(నూగూరు), జనవరి 26(విజయక్రాంతి): మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకను పురస్కరించుకొని మండల కేం ద్రంలోని అన్ని ప్రధాన  ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్రాన్ని  సాధించిన మహనీయుల పేర్లను స్మరించుకున్నారు. స్థానిక విజన్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ఎత్తున వి ద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు.

స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద దేశనాయకుల చిత్రపటాలను ఏర్పాటు చేసి రహదారి ఇరువైపు లా విద్యార్థులతో భారీగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జాతీయ నా యకుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రత్యేక గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు.

జర్నలిస్టుల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకావిష్కరణ

వెంకటాపూర్, జనవరి26,(విజయక్రాంతి):మండలంలోని పాలంపేట గ్రామం లో గల జర్నలిస్టు కాలనీ వద్ద 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. రామప్ప జర్నలిస్టు సొసైటీ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి శివ జండా పథకాన్ని ఎగరవేసి మాట్లాడుతూ.. భారత రాజ్యాం గం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర  దినోత్సవాన్ని జరుపుకోవడం అందరూ రాజ్యాంగ స్ఫూర్తిగా అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నడుచుకో వాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగిశెట్టి రాజేందర్, కేతిరి బిక్షపతి, ఆకుల రామకృష్ణ, బానోత్ యోగి, గ ట్టు ప్రశాంత్, దండేపల్లి సారంగం, సామల విక్రమ్ ఎనగందుల శంకర్, ఆలుగొండ ర మేష్ దేశిని వినీల్ మామిండ్ల సంపత్, రవిరాజా రమేష్, కందికొండ అశోక్, గ్రామస్తు లు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.