11-05-2025 12:55:03 AM
న్యూఢిల్లీ, మే 10: ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచేవారికి భారత్ బలమైన హెచ్చరిక జారీ చేసింది. ఇకపై దేశంలో ఎలాంటి ఉగ్రదాడులు జరిగినా యుద్ధచర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసిం ది. తమదైన రీతిలో సమాధానమిస్తాని వెల్లడించింది. భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో చీఫ్ ఆఫ్ డిఫె న్స్ స్టాఫ్, రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముం దు భారత జాతీయ భద్రతా సలహాదారు అజి త్ దోవల్ సైతం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. భార త్‌గువూ ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని భార త్ స్పష్టం చేసింది.