11-05-2025 01:39:41 AM
- సమావేశానికి పాక్ ప్రధాని పిలుపు!
న్యూఢిల్లీ, మే 10: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం ఆ దేశ న్యూక్లియర్ కమాండ్ బాడీతో సమావేశానికి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. పాక్ క్షిపణి దాడికి ప్రతిగా భారత్ ఆ దేశంలోని అనేక వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది.
రావల్పిండిలోని నూర్‌ఖాన్, చక్వాల్‌లోని మురిత్, షోర్కోట్‌లోని రఫిఖితో సహా పాకిస్థాన్‌కు చెందిన నాలుగు కీలక వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని కమాండ్ అథారిటీ బాడీతో సమావేశానికి పిలుపునిచ్చినట్టు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. నేషనల్ కమాండ్ అథారిటీ అనేది పాకిస్థాన్ అణ్వాయుధ నిల్వలతో సహా, ఆ దేశ భద్రతా అంశాలపై నిర్ణయం తీసుకొనే అత్యున్నత సంస్థ.