calender_icon.png 23 August, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

23-08-2025 01:09:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22: నగరీకరణలో అత్యంత ప్రధానమైన సమస్య కాలుష్యం అది గాలి, నీరు లేదా నేల కాలుష్యం కావొచ్చు. జనసాంద్రత, రవాణా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలు దీనికి కారణాలు. హెచ్‌ఎండీఏ చాలాకాలంగా ‘ఎకో గణేశ్’, ‘గ్రీన్ గణేశ్’, ‘మట్టి వినాయకుడు’ అనే కాన్సెప్టులను ప్రోత్సహిస్తోంది. ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

వాస్తవానికి, 2017 నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించేందుకు హెచ్‌ఎండీఏ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది సైతం మొత్తం లక్ష మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు వినాయక మట్టి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారు.