calender_icon.png 21 January, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మలగుడి రోడ్‌ను విస్తరిస్తాం

22-10-2024 12:25:05 AM

  1. మన్సూరాబాద్ డివిజన్‌లో పర్యటించిన
  2. జోనల్ కమిషనర్ హేమంత కేశవ్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, అక్టోబర్ 21: మన్సూరాబాద్ డివిజన్‌లోని బొమ్మలగుడి ప్రాంతంలో సోమవారం జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్‌కేశశ్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించారు. బొమ్మలగుడి నుంచి ప్రధాన రహదారి ఆక్రమణలతో కుంచించుకుపోయిందని, వాహనాలపై వెళ్లేందుకు ఇబ్బం దులు పడుతున్నామంటూ స్థానికులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు జోనల్ కమిషన్, ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి తమ సమస్యలను విన్నవించుకున్నారు. బొమ్మలగుడి రోడ్డుపై కరెంట్ స్తంభాలు ఉండడంతో ఇరుకుగా తయారైందని, దీంతో రోజూ ట్రాఫిక్ సమస్య వస్తుందని పేర్కొన్నారు. బొమ్మలగుడి  వీరన్నగుట్ట రోడ్డును విస్తరించి, ఒపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు.

వినాయకనగర్‌లో ట్రంక్‌లైన్, వాటర్ స్ట్రామ్ డ్రైన్స్ పనులను పరిశీలించారు. అనంతరం కమిషనర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ... బొమ్మలగుడి ప్రధాన రహదారిని విస్తరిస్తామని, డ్రైనేజీ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.