08-07-2025 12:52:34 AM
దేవాదాయ శాఖ కమిషనర్ విజయ రామారావు
సదాశివనగర్, జూలై 7 (విజయ క్రాంతి), పూజారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని దేవాదాయ శాఖ కమిషనర్ విజయ రామారావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి జిల్లా పూజారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ధూప దీప నైవేద్యం కింద ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదని అన్నారు.
తమకు వేతనాలు పెంచాలని అర్చకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆలయాల్లో పూజారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కత్తి మీద సాము లా పనిచేయడం జరుగుతుందని చాలీచాలని జీతం, తో కుటుంబ భారం, పెరిగే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని అర్చకులు కమిషనర్ దృష్టికి తెచ్చారు.
అర్చకుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని త్వరలోనే అడిగిన వారికి ఐడి కార్డు ఇస్తామన్నారు. రాష్ట్ర ధూప దీప నైవేద్యం అర్చకుల సంఘం నాయకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గరికి ఎన్నోసార్లు వెళ్లి అర్చకుల సమస్యలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.
నిజామాబాద్ జిల్లా అర్చకుల అధ్యక్షుడు రాజప్ప మాట్లాడుతూ ఏది ఉన్న లేకున్నా అర్చకుల సమస్యల పరిష్కారానికి మీ వెంటే ఉంటామన్నారు. ఇప్పటివరకు సాయి శక్తుల సానుకూలంగా స్పందించి అర్చకులకు అండగా నిలిచామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 550 మంది అర్చకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పూజారుల సమావేశం
దూప దీప నైవేద్య అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళన పోతూరి ఆంజనేయ స్వామి దేవాలయం ss నగర్ కామారెడ్డి లో జరిగింది . ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావ్ ముఖ్య అతితి గా వచ్చారు కమిషనర్ మాట్లాతు అర్చకుల సమస్యలు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను బ్రహ్మానున్ని కత్తి సాము లాగా పనిచేయడం మీకు చాలి చాలని జీతం కుటుంబ భారం కొందరి తో ఒత్తిడి కానీ ముందుకంటే ఇప్పుడు కొన్ని రాయతీలు కల్పించి ప్రోత్సహం కల్పిస్తుంది ప్రభుత్వం మనం శాలరీ ఎక్కువ అడగడం తప్పు కాదు దానికి దగ్గ పని కూడా చెయ్యాలి.
ఎప్పుడు ఎవరితో కంప్లెన్ట్ రాకుండా చూసుకో వాలి మీరు అడిగిన ఐడి కాడ్స్ త్వరలోనేఇస్తామన్నారు రాష్ట్ర ddn నాయకులు కృష్ణ మాచర్యులు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గరికి ఎన్నోసార్లు వెల్లి అర్చకుల సమస్యలు తెలియ జేస్తూ ఉన్నాను అన్నారు.ddnరాష్ట్ర వర్గ సభ్యులు శీర్ల వంచ కృష్ణమాచర్యులు వారి పాఠశాల శిష్యులతో పెద్దలను అహ్హనం మరియు జ్యోతి ప్రజ్వల ప్రముఖులకు ఆశీర్వచనం అందించారు.
ఈసందర్బంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాచప్ప మాట్లాడుతూ అర్చకులకు సమస్య ఏదిఉన్న మీవేంటే ఉన్నాను అన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మాదగ్గరకి వచ్చిన ఏ సమస్య అయినా ఇప్పటివరకు మసాయశక్తి తో సానుకూలంగా స్పందించి అందరికి అండగా ఉన్నామన్నారు. జిల్లా కార్యదర్శులు, కార్యవర్గం, మండలాల కార్యవర్గం ప్రతినిధులు,రెండు జిల్లాల పూజారులు 550 మంది అర్చకులు పాల్గొన్నారు.