27-09-2025 01:57:56 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
బెజ్జంకి, సెప్టెంబర్ 26: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బరోసా ఇచ్చారు. శుక్రవారం మండలంలోని బిజెపి నాయకులు కరివేదా మహిపాల్ రెడ్డి, కొలీపాక రాజులు మంత్రి బండి సంజయ్ నీ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో కలిసి బెజ్జంకి మండలంలోని గ్రామాల అభివృద్ధిలో వెనుకబాటుకు గల కారణాలు వివరించారు.
సుమారు రూ.1 కోటి మంజూరు చే యాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేస్తానని బరో సా ఇచ్చారు. బెజ్జంకిలోని శ్రీలక్మి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి సైతం తనవంతు నిధులు విడుదల చేస్తానని తెలిపారు.
నాయకులు ఐక్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మండల అభివృద్ధి తప్పకుండా చేపడతామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండిపల్లి సునీత గౌడ్, సంగా రవి తదితరులుపాల్గొన్నారు.