calender_icon.png 18 July, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి

18-07-2025 12:00:00 AM

  1. జిల్లా ఇంచార్జి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి
  2. నర్సాపూర్లో మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి
  3. కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష

మెదక్, జూలై 17(విజయక్రాంతి): ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో నిబద్ధతతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి  వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, ఇతర జిల్లా అధికారులతో కలిసి శాఖల వారీగా  అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షించారు.

ముందుగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవనం, సంక్షేమం, పరిశ్రమలు, ఇందిరమ్మ ఇండ్లు, వివిధ శాఖల ప్రగతి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రత్యేక  ప్రాధాన్యతని ఇస్తుందన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో విద్యా, వైద్యంతో పాటు సంక్షేమం ప్రగతి పథంలో ముందుకు పోతున్నాయన్నారు,

ఇదే స్ఫూర్తితో  రానున్న రోజుల్లో మెదక్ జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు సమిష్టి కృషి ఎంతో దోహదపడు తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులుపాల్గొన్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్లో  ఏర్పాటు చేసిన అటవీ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ  ఆద్వర్యం లో మెగా  వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 

మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి...

నర్సాపూర్ నియోజకవర్గ వెల్దుర్తి రోడ్ లోని సాయి కృష్ణ గార్డెన్లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి  పాల్గొన్నారు. నర్సాపూర్  నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, కౌడిపల్లి, వెల్దుర్తి, శివం పేట్, హత్నూర, చిలిపిచేడ్ , కొల్చారం స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో  వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ప్రమాదభీమా, రుణభీమా, మహి ళా సంఘాల ద్వా రా నడుపుతున్న ,

నూతన రేషన్ కార్డులనుఅందజేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినీరెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తృటిలో తప్పిన ప్రమాదం...

నర్సాపూర్ లో మంత్రి వివేక్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్లో ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. దీంతో పలు కార్ల ముందు భాగం దెబ్బతిన్నాయి. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.