calender_icon.png 12 August, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీసీఐ నిధులు ఏం చేశారు?

12-08-2025 12:59:56 AM

  1. హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజు విచారణ
  2. నిధుల గోల్‌మాల్‌పై సీఐడీ దర్యాప్తు వేగవంతం 

మేడ్చల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అవకతవకల కేసు విచారణను సీఐడీ వేగవం తం చేసింది. హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజు ను గత నెల 25న అరెస్టు చేయగా.. ఏడు రో జుల కస్టడీకి సీఐడీ తీసుకున్నది. ఐదవ రోజై న సోమవారం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న కార్యాలయానికి తీసుకువచ్చి విచారించారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు ఏం చేశార ని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ఫోర్జరీ సంతకాలు చేయ డం, నిబంధనలను ఉల్లంఘించడంతోపా టు నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో మొత్తం ఆరుగురిపై కేసు నమోదుకాగా దేవరాజుకు ముందస్తు సమాచారం అందడంతో పరారయ్యారు. సీఐడీ అధికారులు నిఘా వేసి పూణేలో అరెస్టు చేశారు. కాగా ఆదివారం దేవరాజు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేశారు.