15-10-2025 01:24:54 AM
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హీరోయిన్ శ్రీలీల. స్టార్స్, టాప్ హీరోల సరసన నటిస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే, ఈ యువ కథానాయకి ఇప్పుడు అభిమానులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యే సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా శ్రీలీల సోషల్‌మీడియా వేదికగా ఓ క్రేజీ పోస్టర్‌ను పంచుకుంది.
అందులో ఈ బ్యూటీ ‘ఏజెంట్ మిర్చి’ అనే సరికొత్త స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తోంది. స్టులిష్ బ్లాక్ అవుట్‌ఫిట్, కూల్ గాగుల్స్, చేతిలో గన్‌తో ఉన్న శ్రీలీల.. ఇందులో మునుపెన్నడూ కనిపించని లుక్‌లో కట్టిపడేస్తోంది. అయితే, అక్టోబర్ 19న అసలు సీక్రెట్ రివీల్ అవుతుందంటూ వ్యాఖ్యను జోడించింది శ్రీలీల. అభిమానులు ఇది కొత్త సినిమా పోస్టరా..? లేక, వెబ్‌సిరీస్ ప్రమోషనా..? అంటూ కామెంట్ బాక్స్‌లో గెస్ గేమ్ ఆరంభించేశారు.
ఇది మరో హిందీ ప్రాజెక్టో.. ఏదైనా ఓటీటీ షోనో తెలియక తికమక పడుతున్న వారంతా మిగతా వివరాల కోసం అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది. ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ఆమె రవితేజ సరసన నటిస్తున్న ‘మాస్ జాతర’ ఈ నెల 31 విడుదల కావాల్సి ఉంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇంకా తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’, బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో మరో సినిమాలో నటిస్తోంది.