calender_icon.png 5 May, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయాన్నే భయపెట్టే ఏకే..!

08-04-2025 12:00:00 AM

‘దమ్ము నాకోసం వదిలిపెట్టా.. మందు నా వైఫ్ కోసం వదిలిపెట్టా.. వైలెన్స్ నా కొడుకు కోసం వదిలిపెట్టా.. కానీ, నా కొడుక్కి ఆపదొస్తే, వదిలింది పట్టుకోవాలిగా..!’ అంటూ ఒక్క డైలాగ్‌తోనే సినిమా కథ ఎవరి చుట్టూ తిరుగుతుందో చెప్పేశారు డైరెక్టర్. కోలీవుడ్ స్టార్ అజిత్‌కుమార్ హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రమే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. కొడుకును కాపాడుకోవడానికి గత జీవి తాన్ని మళ్లీ ఆరంభించే తండ్రిగా అజిత్ పాత్రను ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. ‘వాడు భయాన్నే భయపెట్టేవాడు’ అనే డైలా గ్ కథానాయకుడి పాత్ర ఎంత శక్తిమంతంగా ఉండబోతోందో సూచిస్తోంది.

ఈ సినిమాలో కీలక పాత్ర ల్లో నటిస్తున్న హీరోయిన్ త్రిష కృష్ణన్‌తోపాటు అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ ఈ ట్రైలర్‌లో కనిపించారు. ఈ చిత్రానికి డీవోపీ: అభినందన్ రామానుజం; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్; ఎడిటర్: విజయ్ వేలుకుట్టి; నిర్మాతలు: నవీన్ యెర్నేని, -వై రవిశంకర్; రచనాదర్శకత్వం: అధిక్ రవిచంద్రన్.