23-11-2025 12:33:57 AM
వనపర్తి, నవంబర్ 22 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రం ఎట్లా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతున్నదో మహిళలు గుర్తించాలని పశు సంవర్ధక, మత్స్య, యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగ శనివారం అమరచింత, ఆత్మకూరు మండలాలకు సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు చీరలను ఆత్మకూరు పట్టణంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పంపిణీ చేశా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంతకుముందు ప్రభుత్వంలో మహిళల సంక్షేమం ఎలా ఉన్నది, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఎలా ఉన్నదో మార్పును గమనించాలని కోరారు. గత పది సంవత్సరాల్లో మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని, మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక బలోపేతం చేసి కో టి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పలు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
కాగా కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మిం చి రాకపోకలు సాగించాలని 60 ఏళ్ల కల త్వరలో సాకారం కాబోతుందన్నారు. రూ. 123 కోట్ల వ్యయంతో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పారు. రూ.90 కోట్ల వ్యయంతో ఒక ఆక్వా కల్చర్ కట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆత్మకూరులో నూతన డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నామ ని తెలిపారు.
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ కే.శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభో త్సవం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ రాహమతుల్ల, గీత కార్మికుల సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజు, అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ, తహసిల్దార్ చాంద్ పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, మండల ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.