16-09-2025 12:00:00 AM
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
ఘట్ కేసర్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మేడ్చల్ నియోజకవర్గం ఘట్ కేసర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో 6వ రోజు రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి సోమవారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరై రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది. రైతు రుణమాఫీ కోసం రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అంతటా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఘట్ కేసర్ మండల రైతులు ఏం పాపం చేశారని రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. నేడు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు, ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల కాని కారణంగా కళాశాలల విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏ కొరత లేకుండా పరిపాలన కొనసాగించిందన్నారు. ఈసమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని రైతు రుణమాఫీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
నిరాహార దీక్షలో ఘట్ కేసర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు చందుపట్ల వెంకట్ రెడ్డి, సభ్యులు బొక్క సురేందర్ రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, కట్ట హరినాథ్‌రెడ్డి, మరియు అంకుశాపూర్ రైతు సభ్యులు బొబ్బ ల శ్రీనివాస్‌రెడ్డి, అర్థ బుచ్చిరెడ్డి, బిరెడ్డి మల్లారెడ్డి, చింతల గోపాల్‌రెడ్డి కూర్చున్నారు. రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామి రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి చందుపట్ల ధర్మారెడ్డి, బొక్క స్రవంతి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లు పలుగుల మాధవరెడ్డి, రెడ్యానాయక్, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు కొమ్మగోని రమా దేవి, బండారి ఆంజనేయులు గౌడ్, జహంగీర్, మెట్టు బాల్ రెడ్డి, సింగిరెడ్డి సాయిరెడ్డి, బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, నాయకులు కొమ్మిడి రాఘవరెడ్డి, ఎంపాల సుధాకర్ రెడ్డి, పన్నాల కొండల్ రెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, ఎజ్జల రఘు, పాముల శ్రీరాములు పాల్గొన్నారు.