05-05-2025 12:40:04 AM
కంప్యూటర్ యుగంలో కాలంతో పోటీ పడుతున్న మాన వుడికి సొంత ఇంటి వంట రుచి చూడటానికి కూడా తీరిక లేకుండా పోతోంది. ఎక్కువ మంది ప్రజలు కడుపు నింపుకోవడానికి హెూటళ్లపై ఆధారపడాల్సి వస్తోంది. మరి కొంత మంది ఇంటి భోజ నం రుచించక వారంలో రెండు మూడు రోజులు హెూటల్ భోజనంపైనే ఆధార పడుతున్నారు. అలాంటి వాళ్ళను ఆసరాగా చేసుకుని వారి ఆరోగ్యాలను పక్కన బెట్టి కేవ లం ధనార్జనే ధ్యేయం గా కొందరు హోటళ్ల యజమానులు వ్యవహరిస్తున్నారు.
వనపర్తి, మే 4 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలో కొన్ని హోటల్స్ యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా రు. పలు హోటల్స్, బేకరీస్, రెస్టారెం ట్లలో పరిశుభ్రత లోపించింది. తినుబండారాల్లో పురుగులు, కుళ్లిన ఆహార పదార్థాలు బయ ట పడిన సందర్భాలు ఉన్నాయి.
ధనార్జనే ధ్యేయంగా హోటల్స్ యజమానులు నిల్వ ఉంచిన పదార్థాలను భోజన ప్రియులకు అందిస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారుల జాడే కనిపించడం లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు ప్రత్యక్షమై ఫుడ్ శాంపిల్స్ సేకరించి హడావిడి చేసి నోటీసులు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నాణ్యతపై పట్టింపు ఏది?
వనపర్తి జిల్లా కావడంతో ప్రతి రోజు వందలాది మంది ప్రజలు జిల్లాకు వచ్చి వెళ్తుంటారు. భోజనం కోసం స్థానికంగా హోటల్స్ వైపే మక్కువ చూపిస్తారు. వనపర్తి జిల్లాలో కేంద్రం లో ప్రతి ప్రధాన చౌరస్తా లో మూడు నాలుగు చొప్పున హోటల్స్ ద ర్శనం ఇస్తాయి. కాగా కొన్ని హోటళ్లలో సరై న నాణ్యతలేని ఫుడ్ యజమానులు కస్టమర్లకు అందిస్తున్నారు. ఆరగించిన కస్టమర్లు రోగాల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించింది. కిచెన్లు, వాష్ రూమ్‌లలో పరిశుభ్రత లోపించి దుర్గంధంతో దోమలు, బ్యాక్టీరియా స్త్వ్రర విహారం చేస్తున్నాయి. పలు మార్లు హోటళ్లలో తినే ఆహారంలో పురుగులు బయట పడిన సందర్భాలు ఉన్నాయి. కళ్లిపోయిన, ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన ఆహారపదార్థాలను వేడిచేసి వడ్డించిన ఘటనలు వెలుగు చూశాయి.
మరి రెస్టారెంట్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం అం దిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలు యాజమాన్యాలు మాత్రం ధనార్జనే ధ్యేయం గా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని పలువురు మండి పడుతున్నారు.
పేరుకు భోజన శాలలు లోపల మొత్తం మద్యం సిట్టింగ్ శాలలు
జిల్లా కేంద్రంలో గల భోజన శాలలో కొన్ని మాత్రమే అలాగే ఉన్న చాలా వరకు ముందు వరుసలో బిర్యానీ సెంటర్లు లోపల మాత్రం మద్యం సిట్టింగ్ కేంద్రాలుగా మా రాయి. అటు తనిఖీ లు చేయాల్సిన ఆహార తనిఖీ, ఇటు పోలీసు, మద్య నిషేధ నియంత్రణ అధికారులు పట్టించుకొక పోవడం వె నుక పలు అనుమానాలకు దారి తెస్తున్నా యి.
ఇటీవల కొత్తకోట రోడ్డు లో ఓ భోజన శాల వద్ద కొంతమంది యువకులు మద్యం సేవించి ఓ యువకుడి పై కొందరు యువకులు దాడికి యత్నిం చగా అక్కడి నుండి త ప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఘటన సైతం ఉన్నాయి.
జాడ లేని ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు
కలెక్టర్ కార్యాలయం లోని ఓ ప్రధాన శా ఖ లో ఒక చిన్నపాటి టేబుల్ గల స్థలం లో ఆహార నియంత్రణ శాఖ పని చేయడం కోసమేరుపు. వనపర్తి జిల్లా తో మరో జిల్లాకు సైతం ఇంచార్జి గా ఉండడం తో హెూటల్స్, రెస్టారెంట్లు యజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్ట రాజ్యంగా వ్యవ హ రిస్తున్నారు.
ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికా రులు వెంటనే స్పందించి నిబంధనలు పాటించకుండా కల్తీ ఆహారాన్ని అందజేసే వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉందని జిల్లా ప్రజలు కోరుతున్నారు.