calender_icon.png 9 October, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్వరం మెడికల్ కాలేజీ ఎక్కడ?

09-10-2025 12:45:20 AM

బాకీ కార్డు పంపిణీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు, అక్టోబర్ 8 : మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఎక్కడ అని మాజీ మంత్రి స్థానిక ఎం ఎల్ ఏ పి. సభితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం మీరఖాన్పేట్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సబితా గారు పేర్కొన్నారు.ఈ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా ఇచ్చిన 420 హామీలలో ఒక్కటీ అమలు కాలేదన్నారు.

గత ప్రభుత్వ పథకాలదే ప్రజలకు ఇప్పటికీ అందుతున్నాయన్నారు. అబద్ధాలతో రోజులు గడిపే ప్రభుత్వమిది అని అన్నారు. మహిళలకు ఇప్పటికీ గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలనే ధరించి స్వాగతం పలికారని, అలాగే దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు తమ కారు ద్వారా ప్రతిరోజు ఆదాయం వెయ్యి రూపాయల ఆదాయం పొందుతున్నానని లబ్ధిదారుడు సబితమ్మతో పేర్కొన్నాడు.ఇలాంటి పథకాలే ప్రజలకు నిజమైన మేలు చేశాయని, ఈ ప్రభుత్వం కొత్తగా ఏం చేసింది లేదని ఆమె ప్రశ్నించారు.అదేవిధంగా,రెండు మూడు రోజుల కిందట  వచ్చి ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ని ఉద్దేశిస్తూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు.ఫ్యూచర్ సిటీ పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎందుకు నిలిపివేశారని మండి పడ్డారు. ఆ కాలేజ్ ఏర్పడితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని,ప్రజలకు వైద్య పరంగా ఎంతో మేలు కలిగేదని,కానీ దానిని కూడా రద్దు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. మీరఖాన్పేట్ ప్రధా న రహదారి విషయంలో కూడ ఆమె ప్రభు త్వం వైఖరిని ప్రశ్నించారు.కేసీఆర్ గారి హ యాంలో ఫార్మసిటీ రోడ్డు 75 శాతం పూర్తయిందన్నారు. మిగిలిన 25 శాతం ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. ఫోర్త్ సిటీ ప్రాజెక్ట్లో భాగమైన ఈరోడ్డు నిర్మాణాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఘాటుగా స్పందించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి ప్రజలు చెప్తారని తెలిపారు.కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, ప్యాక్స్ చైర్మన్ చంద్రశేఖర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సురసాని సురేందర్ రెడ్డి, లక్ష్మినర్సింహ రెడ్డి,మీర్ఖాన్పేట్ తాజా మాజీ సర్పంచ్ బ్రాహ్మణపల్లి జ్యోతిచంద్రశేఖర్, ఎంపీటీసీ కాకి రాములు,ఎంపీటీసీ ఫోరమ్ మాజీ అధ్యక్షుడు సురసాని రాజశేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్ రెడ్డి,డైరెక్టర్ పొట్టి ఆనంద్, లచ్య నాయక్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, కుమార్, యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, మాజీ డైరెక్టర్లు ప్రకాష్ రెడ్డి, పారిజాతం, దేవీలాల్ నాయక్, గొర్రెంకల రామకృష్ణ, దామోదర్ గౌడ్, ఎస్సీ సెల్ సామయ్య, గ్రామ అధ్యక్షుడు శివప్రసాద్ చారి, మాజీ సర్పంచులు పరంజ్యోతి, నర్సింహ, జంగ య్య, బాలకృష్ణగణేష్, నాయకులు సుదర్శన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, తిరుపతయ్య, జైపాల్, వేణు, అంజయ్య, తేజ నాయక్, వెంకటేష్, అఖిల్, మోకీం, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.