09-10-2025 01:03:41 AM
5 సంవత్సరాల లోపు చిన్నారులకు చుక్కల మందు
అంబర్ పేట క్లస్టర్ డాక్టర్ పద్మజ
ముషీరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన పల్సిపోలియో కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొ దటి రోజు ప్రధాన కేంద్రాల్లో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కల మం దు తప్పనిసరి వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముషీరాబా ద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ)లతోపాటు ఇంటింటికి వెళ్లి చిన్నారులకు చుక్కల మందు వేసే కార్యక్రమం చేపట్టింది.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని యూపీహెచ్సీలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బుధవారం ము షీరాబాద్ యూపీహెచ్సీలో అంబర్ పేట క్లస్టర్ డాక్టర్ పద్మజ స్థానిక వైద్యులతో పల్స్ పోలియోపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్, భోలక్ పూర్, తిలక్ నగర్, ఏఎంఎస్, బాగ్ అంబర్ పేట, హర్రాస్ పెంట వైద్యులచే సమావేశం నిర్వహించారు. తీసుకోవల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
183 కేంద్రాలలో పల్స్ పోలియో..
అంబర్ పేట క్లస్టర్ పరిధిలోని ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి 183 కేంద్రాలలో పోలియో చుక్కల మందులు వేయనున్నారు. ముషీరాబాద్‌లో 15 కేంద్రా లు, భోలక్ పూర్‌లో 26 కేంద్రాలు, రంగానగర్ లోని బైబిల్ హౌస్ యూపీహెచ్సీలో 20 కేంద్రాలు, ఏఎంఎస్ లో 20 కేంద్రాలు, తిలక్ నగర్ యూపీహెచ్సీలో 30 కేంద్రాలు, బాగ్ అంబర్ పేటలో 35 కేంద్రాలు, హర్రాస్పెంటలో 29 కేంద్రాలలో పిల్లలకు చుక్కల మందులు వేయనున్నారు.
తప్పనిసరి పిల్లలకు చుక్కల మందులు వేయించాలి : డాక్టర్ పద్మజ
5సంవత్సరాలలోపు పిల్లలందరికి తప్పనిసరి పల్సోపోలియో చుక్కలు వేయించాలి. పిల్లలకు జ్వరం, విరోచనాలు ఇతర సమస్యలు ఉన్నా చుక్కల మందు వేయించవ చ్చు. ప్రధాన కూడళ్లు, స్థానికంగా ఉండే కమ్యూనిటీ హాల్స్ వద్ద పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 13, 14 తేదీలలో ఇంటింటికి వెళ్లి తమ సిబ్బంది పోలీయో చుక్కల మందు వేయించుకోని వారిని గుర్తించి చుక్కల మందు వేస్తాం.
వీధుల్లో ప్రచారం :- డా.మనోజ్‌రెడ్డి
ముషీరాబాద్ యూపీహెచ్సీ వైద్యాధికారి చిన్నారులకు తప్పనిసరి చుక్కల మందు వేయించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వీధులలో ప్రచారం చేస్తున్నాం. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు వీధు ల్లో తిరుగుతూ 5సంవత్సరాలలోపు చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేయిం చేలా చర్యలు చేపట్టాం. తమ ఆసుపత్రి పరిధిలో 2,686 మంది చిన్నారులు ఉన్నారు.