13-12-2025 12:14:36 AM
ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు, సన్మానం
వేములవాడ,డిసెంబర్ 12,(విజయ క్రాంతి)తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు శుక్రవారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ నూతన సర్పంచ్లకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసి,అభినందించి ఘనంగా సన్మానించారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను విశ్వసించి మొదటి విడతలో విజయం అందించారని, రెండవమూడవ విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు కొనసాగించాలని ఆయన కోరారు.