calender_icon.png 16 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లెప్పుడంటే జాన్వీ ఏమంది?

16-09-2025 01:08:00 AM

మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా, నటి జాన్వీ కపూర్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా వదంతులు వస్తున్నాయి. ఇద్దరిలో ఎవరూ ఆ ప్రచారాన్ని ఖండించలేదు. ఏదైనా వేడుకలో వారిద్దరు కనిపించడం ఆలస్యం సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యేవి. దీంతో, ‘పెళ్లెప్పుడు?’ అని విలేకరులు ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ స్పందించారు. ప్రస్తుతానికి నటనపైనే దృష్టి పెట్టానని, పెళ్లికి ఇంకా సమయం ఉందని తెలిపారు.

కానీ, శిఖర్ ప్రస్తావన తీసుకురాలేదు. ముంబయిలో నిర్వహించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. వరుణ్ధావన్, జాన్వీ జంటగా శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన చిత్రమిది. అక్టోబరు 2న విడుదల కానుంది. ఓ సందర్భంలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్ నంబర్లను ప్రస్తావిస్తూ.. తన తండ్రి, చెల్లి, శిఖర్ పేర్లు చెప్పడంతో రూమర్స్ వచ్చాయి. ‘శిఖు’ పేరుతో కూడిన లోగో ఉన్న నెక్లెస్ ధరించి, జాన్వీ ఓ ఈవెంట్కు హాజరైనప్పటి నుంచి వాటికి బలం చేకూరింది. గత నెలలో ‘పరం సుందరి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీ.. మరికొన్ని రోజుల్లో ‘హోంబౌండ్’, ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ చిత్రాలతో సందడి చేయనున్నారు. తెలుగులో రామ్చరణ్ సరసన ‘పెద్ది’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.